తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మరియు కేరళ రాష్ట్ర రాజధాని నగరం తిరువంతపురం సెంట్రల్ నగరాలను శబరి ఎక్స్ ప్రెస్  కలుపుతుంది. దక్షిణ మధ్య రైల్వే నిర్వహించే ఈ రైలు 30 గంటల, 25 నిమిషాల్లో 1568 కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. గతంలో రైలు సంఖ్యలు 7230/7229 తో హైదరాబాద్ మరియు ఎర్నాకుళం (కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ కోడ్: CHTS) మధ్య ప్రయాణించడానికి రైలును ఉపయోగించారు.

రైలును 2005 మార్చి 27 నుండి త్రివేండ్రం సెంట్రల్ వరకు పొడిగించారు. కాగా నిత్యం హైదరాబాద్‌ - తిరువనంతపురం మధ్యన గుంటూరు మీదగా రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్‌.. రాక, పోక సమయాల్లో ఈ నెల 27వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ రైలు హైదరాబాద్‌ నుంచి కాకుండా నిర్ణీత తేదీ నుంచి సికింద్రాబాద్‌కు టర్మినల్‌ పాయింట్‌ని మార్చారు.

తిరువనంతపురం - సికింద్రాబాద్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 6.28కి తెనాలి, 6.55కి గుంటూరు, 7.40కి సత్తెనపల్లి, 8.04కి పిడుగురాళ్ల, 8.25కి నడికుడి, 8.55కి మిర్యాలగూడ, 9.25కి నల్గొండ, 11.24కి చర్లపల్లి, మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్‌ చేరుకొని ప్రయాణం నిలిచిపోతుంది. 

ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని సీనియర్‌ డీసీఎం డీ నరేంద్రవర్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రైలు సికింద్రాబాద్‌ - తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌గా మారుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి చర్లపల్లికి 12.37కి, నల్గొండకు మధ్యాహ్నం 2 గంటలకు, మిర్యాలగూడకు 2.25కి, నడికుడికి 3.10కి, పిడుగురాళ్లకు 3.30కి, సత్తెనపల్లికి సాయంత్రం 4.04కి, గుంటూరుకు 5 గంటలకు చేరుకొని 5.20కి బయలుదేరుతుంది. రైల్ లో డిసెంబర్ నుంచి జనవరి మాసాల వరకు తాత్కాలికంగా ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ని ఏర్పాటు చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: