శాసనమండలిని అన్ని రాష్ట్రాల్లో లేదు.  అవసరం అనుకుంటేనే దీనిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.  కానీ, అవసరం లేదు అనుకుంటే మాత్రం దానిని పెద్దగా పట్టించుకోరు.  శాసనమండలిని ఏర్పాటు చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు.  అవేమంటే, శాసనమండలి వలన ఉండే ఉపయోగాలు అన్ని కూడా రాజకీయ కోణంలోనే ముడిపడి ఉంటాయి.  ఎలాగంటే, ఎమ్మెల్యేగా అవకాశాలు దక్కని వ్యక్తులకు నామినేటెడ్ పదవులు ఇస్తుంటారు.  ఈ నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్సీ పదవులు కూడా ఒకటి.  


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు.  వీరి పదవి కాలం ఆరేళ్ళు.  ఎమ్మెల్యేల సంఖ్యాబలం నుంచి కొంతమంది ఎంపికవుతుంటారు.  టీచర్లు నుంచి కొందరు, కార్మికుల నుంచి కొంతమంది ఎంపిక అవుతుంటారు.  అందరికి బాధ్యతలు ఇస్తుంటారు.  చాలా వరకు చూసుకుంటే, ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఎంపికయ్యే విషయంలో అధికార పార్టీకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.  ఎందుకంటే వారిబలమే ఎక్కువ కాబట్టి.

 
ఒకందుకు చెప్పాలి అంటే నేతలను బుజ్జగించేందుకు మాత్రమే ఈ శాసనమండలిని ఏర్పాటు చేసుకుంటారు.  అలా అనికూడా కాదు, ఇందులో కొంతమంది మేధావులు కూడా ఉంటారు కాబట్టి సెకండ్ ఒపీనియన్ కోసం ఈ సభను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.  ఈ సభ కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తుంది.  శాసనమండలి కోసం రోజుకు కోటి రూపాయల చొప్పున ప్రభుత్వంఖర్చు చేస్తున్నట్టు ఇటీవలే మంత్రులు సభలో పేర్కొన్నారు.  


కోటి రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి అని ప్రశ్నిస్తున్నారు.  ఎందుకు చేయాలి అనే లెక్కలు తీసుకుంటే చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు అనుకోండి.  ఇప్పుడు ఆ విషయాలు అప్రస్తుతంకదా.  శాసనమండలిని విధిగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే దాని లెక్క వేరుగా ఉంటుంది.  కానీ లేవలం దేశానికీ 7 రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉన్నది అంటే, దాని అర్ధం ఏంటో యిట్టె అర్ధం చేసుకోవచ్చు.  అదన్నమాట సంగతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: