కొత్తగా పెళ్లయింది అంటే అబ్బో రొమాంటిక్ మూడ్ ను మామూలుగా ఉండదు కదా. కొంచెం ఖాళీ టైం దొరికినా రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళి పోతూ ఉంటారు నవదంపతులు. ముఖ్యంగా హనీమూన్ కి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ కొత్త జంట హనీమూన్ కి వెళ్ళింది. యువతి తల్లి ఒంటరిగా ఉంటుందని తన తల్లిని కూడా తమతో పాటే హనీమూన్ కి తీసుకెళ్లారు. ఇక తొమ్మిది నెలల తర్వాత గర్భవతియై ఒక బిడ్డకు జన్మనిచ్చింది. జన్మనిచ్చింది కూతురు అనుకునేరు కూతురు తల్లి. ఆశ్చర్య పోయారు కదా. బ్రిటన్లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. కూతురితో హనిమూన్ కి వెళ్లిన  తల్లిని గర్భవతిని చేశాడు ఇక్కడ ఒక ప్రబుద్ధుడు. 

 

 

 లండన్లోని ట్వికెన్హోమ్ కి చెందిన లారెన్ వాల్ ... ఎయిర్పోర్ట్ వర్కర్ పాల్ వైట్ ను పెళ్లి చేసుకుంది. ఆమె తల్లి జూలీ 14 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తన కూతురు వివాహం వైభవంగా జరిపింది . పెళ్లి అనంతరం ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్ళింది. తల్లి ఒంటరిగా ఉండటం ఎందుకని తల్లిని కూడా హనీమూన్కి తమతోపాటు తీసుకెళ్లారు. ఇక తొమ్మిది నెలల తర్వాత ఆ యువతి తల్లి ఓ పాపకు జన్మనిచ్చింది. పాపకు తండ్రి ఎవరో కాదు యువతి భర్త పాల్ వైట్ . ఈ విషయం తెలిసిన కూతురు షాక్కి గురైంది. తన తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు చెప్పాడు ఆ యువతి భర్త.కాగా  హనీమూన్ లో వీరిద్దరు క్లోజ్ గా ఉండడం తో అత్త గారి తో చనువుగా ఉంటున్నాడు అనుకుంది కాని తెర వెనుక ఇంత తతంగం నడుస్తూ ఉంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేక పోయింది  ఆ యువతి. 

 

 

 ఇక ఈ విషయంపై తన భర్తను ఆ యువతి నిలదీయడంతో... వెడ్డింగ్ రింగ్ తీసేసి లారెన్ కు భర్త  ఇచ్చేసాడు. ఇక 7 నెలల పాపను కూడా లారెన్ దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. లారెన్స్ తల్లి దగ్గరికి వెళ్లి ఆమెతోనే ఉండిపోయాడు పాల్  వైట్. ఈ విషయంపై కూతురు తల్లి నిలదీస్తే తాము ఒకరినొకరు ప్రేమించుకున్నామని ప్రపంచంలో ఎవరు ఏమనుకున్న.. తాము ఒకటిగానే ఉంటామంటూ చెప్పడంతో... తల్లి మాటలు లారెన్ తట్టుకోలేకపోయింది. ఇక ఐదేళ్ల తర్వాత లారెన్ కు విడాకులు ఇచ్చిన పాల్ వైట్  ఆమె తల్లిని పెళ్లి చేసుకున్నాడు. కాగా  తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది లారెన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: