మటన్ చికెన్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మటన్ ప్రియులైతే ఆందోళన చెందుతున్నారు. మాకేమో ముక్క లేనిదే ముద్ద దిగదు అక్కడేమో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ఈ క్రమంలో మేము మాంసాన్ని ఎంజాయ్ చేసేది ఎలా అంటూ మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మటన్ ధర అయితే రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. మాంసం తినేవాళ్ళు  ఎక్కువ మొత్తంలో మటన్ తినడానికి ఆసక్తి చూపుతుండడంతో మటన్ కు భారీగా డిమాండ్ వచ్చే ధరలు  కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది మాంసం ప్రియులు మటన్ తినాలని ఉన్న భారీగా పెరిగిన ధరలతో వెనకడుగు వేసి చికెన్ తింటూ సర్దుకుపోతున్నారు. 

 

 

 మటన్ ధరలకు రెక్కలు వచ్చి రోజురోజుకు.. మాంసం ప్రియులకు మటన్ భారంగా మారి పోతుంది. మామూలుగానే 500 నుంచి 600 రూపాయలు పలికే మటన్ ధర... ఈ మధ్య ఇంకా పెరిగిపోతుంది. దీంతో మాంసం ప్రియులందరూ బెంబేలెత్తిపోతున్నారు. రోజు మాంసం తినడానికి ఇష్టపడే వారు వారానికి ఒక్కసారి మాంసం తినడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మాంసం ధరలు పెరిగాయి మరి. కొంతమంది మాంసం ధరలు భారీగా పెరిగినప్పటికీ... ఏం చేస్తాం మాంసం తినకుండా ఉండలేమూ  కదా అనుకుంటూ కొనుగోలు చేస్తున్నారు. 

 

 

 రోజురోజుకు మహా ప్రియంగా మారుతున్న మటన్ ధర మొన్నటి సంక్రాంతి వరకు ఆరు వందల రూపాయలకు కిలో పలికింది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కిలో ధర 650 రూపాయలు నుంచి  680 రూపాయలకు చేరుకుంది. ఇక ఎముకలు లేని మటన్ కావాలంటే మాత్రం 780 రూపాయల నుంచి 820 వరకు చెల్లించాల్సి ఉంది.  అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మటన్ ధర 560 రూపాయల నుంచి 600 మధ్య పలుకుతున్నట్లు  తెలుస్తోంది.  అయితే రోజు రోజుకు మాంసం ప్రియులు  పెరుగుతుండడం.. ఇతర కూరగాయల కంటే మాంసం తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో  మాంసానికి అధికంగా డిమాండ్ ఏర్పడుతుంది.. దీనివల్లే మాంసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి అని జాతీయ మాంస పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: