టైటిల్ చూడగానే.. ఎక్కడ దొరుకుతాయి ఈ పవర్‌ఫుల్ వయాగ్రా రైస్ అని అందరూ అనుకుంటూ ఉంటారు.. అసలు వయాగ్రా రైస్ అని పేరు వింటూనే ఏంటబ్బా ఈ కొత్త రైస్ అని వచ్చేశారు కదా... సరే.. ప్రస్తుతం మన భారత్ లో ఎంతోమంది సంతానలేమి బాధతో అవస్థలు పడుతున్నారు. 

 

సంతానం కోసం ఎన్ని మందులు అయినా వాడుతారు.. కొంతమంది ఇంగ్లీష్ మందులు వాడితే.. మరికొంతమంది నాటు మందులు వాడుతారు. ఇలా నాటు మందులు వాడటం వల్ల కాదు కాదు ఎక్కువ ముందులు వాడటం వల్ల పిల్లలు కలగడం ఏమో కానీ ఆ మహిళలు అనారోగ్యపాలై కొందరు మరణిస్తే మరి కొందరు మంచాన పడుతున్నారు. 

 

ఇంకా ఇలాంటి క్యాష్ చేసుకోడానికే... ఈ వయాగ్రా రైస్ పుట్టుకొచ్చింది. మనం తినే యెర్ర బియ్యాన్ని కొందరు బిజినెస్ కోసం వయాగ్రా రైస్ చేసేశారు.. అవి తింటే.. మధుమేహం, ఒబేసిటీ రావు అని.. ఈ రైస్ ను తింటే పిల్లలు పుడతారు అని.. నరాల బలహీనతల్ని నయం అవుతుంది అని.. అన్ని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. 

 

అసలు వయాగ్రా రైస్ అని మనం పిలుస్తున్నాం కానీ దాని నిజమైన పేరు యెర్ర బియ్యం.. ఇది నిజంగా తమిళనాడు పంట అయినప్పటికీ ఈ బియ్యంలో ఇతర రకాల బియ్యంలో కంటే కొంచం ఎక్కువ శక్తి.. ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఉదయం తింటే రాత్రి వరుకు ఆకలి కాదు.. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల్లో పండే బియ్యంతో పోలిస్తే ఈ ఎర్రన్నం అంత త్వరగా జీర్ణం అవ్వదు... అందుకే ఆకలి అవ్వదు. 

 

ఈ బియ్యం అరుదైనవి కాదు.. ఈ పంట తమిళనాడులో, కేరళలో ఎక్కువ పండుతుంది. ఎక్కువదారాకు అమ్ముకోవాలి అని వీటిపై కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నారు జనాలు. ఈ రైస్ ని.. రైస్ పౌడర్ ను చేసి వంద గ్రాములు.. రెండు వందల గ్రాముల చొప్పున అమ్ముతున్నారు తప్ప ఇవి తింటే పిల్లలు పుట్టారు.. రోగాలు నయం అవ్వవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: