కేవలం సాధారణ మహిళల పై నే కాదు సెలబ్రిటీ మహిళలు కూడా ఎన్నో లైంగిక వేధింపులు ఎదుర్కొంటారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖ సెలబ్రెటీలను తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి మీటూ ఉద్యమం ద్వారా తెరమీదికి తెలిపపి  సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో హాలీవుడ్ నటి తనకు జరిగిన అన్యాయం గురించి తాజాగా వెల్లడించారు. 25 ఏళ్ల క్రితం డైరెక్టర్ హార్వే వెయిన్స్టెన్  తనను అతి దారుణంగా అత్యాచారం చేశాడంటూ హాలీవుడ్ నటి అన్నాబెల్లె సియెరా  గురువారం కోర్టులో భావోద్వేగానికి లోనయ్యారు. జడ్జి ఎదుట తనపై జరిగిన ఘోరాన్ని చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

 

 

 వివరాల్లోకి వెళితే... 1994లో ఓ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో.. ఆ సినిమా దర్శకుడు  ఇంటిదగ్గర దింపు తాను అంటూ నన్ను  కారులో ఎక్కించుకున్నాడు.  న్యూయార్క్లోని మహట్టన్  అపార్ట్మెంట్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఇక తాను పడుకునే సమయంలో ఎవరో డోర్  కొట్టినట్లు అనిపించడంతో  డోర్ తెరిచి చూడగానే డైరెక్టర్ వేయిన్స్టిన్  ఎదురుగా నిలబడి ఉన్నాడు. అప్పటికే భయాందోళనకు గురైన తాను ఎందుకు వచ్చారు అని అడిగే లోపే బలవంతంగా బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి... ప్రతిఘటించకుండా మంచానికి కట్టేసి అతి దారుణంగా రాత్రి మొత్తం అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 

 

 ఆ రోజు నా జీవితంలో ఒక చేదు ఘటన గా మిగిలిపోయింది. ఇన్ని సంవత్సరాలైనా 25 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇంకా గుర్తు వస్తూనే ఉంది అంటూ 59  ఏళ్ళ అన్నబెల్లా కోర్టులో జడ్జి ముందు తన బాధను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో 25 ఏళ్లుగా కోర్టులో ఈ కేసు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ దర్శకుడు... కేవలం అనాబెల్లా  పైనే కాదు మరో 80 మందిని కూడా లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా  ఆ మహిళ వాదనలో ఎంతవరకు నిజాలు ఉన్నాయని తేల్చడానికి సైకే  ఆర్టిస్ట్ ను  రప్పించాలంటూ  కోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: