తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీలే పార్టీ నాయకత్వానికి ఎదురు తిరిగారా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీలో పాసైన బిల్లులను మెజారిటి ఉంది కదా అన్న ఉద్దేశ్యంతో శాసనమండలిలో తెలుగుదేశంపార్టీ అడ్డుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే పద్దతిలో తాజాగా అసెంబ్లీలో పాసైన పాలనా వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి చట్టం-2020, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను కూడా టిడిపి అడ్డుకుంది.

 

అడ్డుకోవటం ఓకేనే కానీ అడ్డుకున్న తీరుపైనే మండలిలో రేగిన మంటలు అందరు చూసిందే. ఇక్కడే కొందరు శాసనమండలి సభ్యులు టిడిపి నాయకత్వంపై మండిపోయారట. మండలిలో  కీలకమైన బిల్లులను అడ్డుకుని ఎటువంటి ఉపయోగం లేనపుడు ఎందుకు అడ్డుకోవాలి ? అని సభ్యులు నాయకత్వాన్ని నిలదీశారట. మండలిలో బిల్లులు పాసు కాకుండా అడ్డుకోవటం వల్ల మహా అయితే  ఓ నెలో లేకపోతే  మూడు నెలలు మాత్రమే అడ్డుకోగలదు కానీ శాస్వతంగా కాదు కదా ? అని చాలామంది ఎంఎల్సీలు యనమల రామకృష్ణుడు, లోకేష్ ను నిలదీశారట.

 

అయితే మెజారిటి సభ్యుల ఆలోచనలను వీళ్ళు పట్టించుకోలేదని సమాచారం. రెండు బిల్లులను టిడిపి అడ్డుకోవటం వల్ల అసలు మండలి ఉనికికే ప్రమాదం వస్తుందని కొందరు ఎంఎల్సీలు మొత్తుకున్నా నాయకత్వం పట్టించుకోలేదట. ఇదే విషయంపై ఇద్దరు ఎంఎల్సీలు పోతుల సునీత, సిద్ధార్ధరెడ్డి నాయకత్వానికి ఎదురు తిరిగినట్లు సమాచారం. ఎదురు తిరగటంలో భాగంగానే  రూల్ -71 పై జరిగిన ఓటింగ్ లో  టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు.

 

ఇద్దరు సభ్యులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని నాయకత్వానికి వివరించిన మిగిలిన వాళ్ళు మెజారిటి సభ్యుల మనోగతాన్ని వివరించినా యనమల, లోకేష్ అసలు పట్టించుకోలేదట. దాంతో చేసేది లేక మౌనం వహించారు. చివరకు టిడిపి అనుకున్నట్లు, చంద్రబాబు భావించినట్లు ఛైర్మన్ ను మ్యానేజ్ చేసి బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించేశారు. అయితే చివరకు సాంకేతిక కారణాలతో ఆ ప్రకటన కూడా చెల్లుబాటు కాలేదు.  అంటే టిడిపి నాయకత్వం ఓవర్ యాక్షన్ ఫలితంగానే చివరకు శాసనమండలి ఉనికే ప్రశ్నార్ధకంగా మారిందంటూ మండిపోతున్నారు.

==

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: