డబ్బు మనిషి వీక్ నెస్. డబ్బు సంపాదించాలని కోరుకోని వారు ఉండరు. దాన్ని సక్రమ మార్గంలోనే చాలామంది సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రం రోజుల్లోనే కోటీశ్వరులైం అయిపోయాలి అనుకుంటారు. ఆ యావతోనే మోసాలలకు పాల్పడతారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడతారు.

 

వీరి ప్రలోభాలు భలే ఉంటాయి. రూ. 10 వేలు పెట్టుబడిగా పెడితే రోజుకు 200ల చొప్పున ఇస్తా

మని చెబుతారు. వంద రోజుల్లో ఇలా రూ.20వేలు అవుతుందని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. వారి మాటలు నమ్మి చాలా మంది లక్షల్లో మోసపోయారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన శ్యామ సుందర్ గతంలో నల్గొండ, హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాడు. వీటిలో అనుకున్న లాభాలు రాక పోవడంతో చెయిన్ మోసాలకు తెరతీ శాడు. పదేళ్ల క్రితం చైతన్యపురిలో 'ఓషన్ బ్లూ' పేరుతో గొలుసుకట్టు పథకం ప్రారంభించాడు. లక్షల్లో వసూలు చేసుకుని పారిపోయాడు. తర్వాత విజయవాడకు వెళ్లి బెంజి సర్కిల్లో 'మల్టీమాక్స్' పేరుతో మరో సంస్థను నెలకొల్పి అక్కడ కోట్లు వసూలు చేసుకుని అదృశ్య మయ్యాడు.

 

రాజమండ్రికి చెందిన వాసుదేవ నాయుడుకి ఐదేళ్ల క్రితం శ్యామ సుందరకు పరిచయమయ్యాడు. సులభంగా డబ్బు సంపాదిం చేందుకు మార్గాలు అన్వేషి స్తున్న క్రమంలో ఇద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి చెయిన్ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు వంటి నగరా లను ఎంచుకోవడం అక్కడికి మూడు నెలల పాటు మాత్రమే గదులు

తీసుకోవడం, ప్రధాన ప్రాంతాల్లో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని చెయిన్ మార్కెటింగ్ పేరుతో జనాన్ని నమ్మించే మోసం చేస్తున్నారు. అందుకే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: