సామాన్యంగా మహిళలు అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణమైంది. ఇటీవల కాలంలో బహు భర్తలు, వివాహేతర సంబంధాల కారణంగా కూడా తరచుగా హత్యాకాండ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ కు చెందిన  సలీంకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య తహేరాబేగం(35), ఇద్దరు కూతుళ్లతో కలిసి మల్లెపల్లిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నాడు. పెద్ద కూతురుకు 17 సంవత్సరాలు పడ్డాయని పెళ్లి చెద్దామని భార్యకు భర్త సూచించాడు. భార్య తొలుత ఇల్లు కట్టిన తరువాతే పెళ్లి చేద్దామని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన సలీం కత్తి తీసుకొని భార్యను హత్య చేశాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లను రెండో భార్య దగ్గర వదిలిపెట్టి పారిపోయాడు.

ఈ క్రమంలోనే రెండో భర్త ఏకంగా మొదటి భర్తను హత్య చేశారు. భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఇల్లాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయినా మొదటి భర్త విడిచి పెట్టకుండా అక్కడకూ వచ్చి విసిగించ సాగాడు. దీంతోవిసుగు చెందిన  రెండో భర్త మొదటి భర్తను హత్య చేశాడు... వివరాల్లోకి వెళితే..కర్ణాటక లోని డీజే హళ్లి(దేవరజీవనహళ్లి) వద్ద కావలభైర సంద్రలో నివసించే ఇలోపర్ భాను, మాంసం వ్యాపారం చేసుకునే ఇర్ఫాన్ ని  నాలుగేళ్ళ క్రితం వివాహాం చేసుకుంది. ఇర్ఫాన్ రోజు తాగి వచ్చి భార్య ఇలోపర్ భానును హింసించసాగాడు.  దీంతో విసుగెత్తిన ఇలోపర్ భాను ఇర్ఫాన్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది.

కొన్నినెలల క్రితం భాను తౌసిఫ్ అనే ఆటో డ్రయివర్ను పెళ్లి చేసుకుంది. ఈ సంగతి తెలిసిన ఆమె మొదటి భర్త ఇర్పాన్  అప్పడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడుతున్నాడు. భాను, ఆమె రెండో భర్త ఇలా చేయటం బాగోలేదని ఎన్నిసార్లు నచ్చ చెప్పినా వినకుండా ఇర్ఫాన్ తన వైఖరి మార్చుకోకుండా  తరచు ఆమె వద్దకు వెళ్లి గొడవపడుతూనే ఉన్నాడు. జనవరి22వతేదీ బుధవారం రాత్రికూడా తాగి  ఇలోపర్ భాను ఇంటికి వెళ్లి  గొడవ పడ్డాడు. దీంతో  విసుగు చెందిన తౌసిఫ్ ఆవేశంతో ఇర్ఫాన్ ను కత్తితో గుండెల్లో పొడిచి  హత్య చేశాడు.  సమచారం  తెలుసుకున్న డీజే.హళ్లి పోలీసులు ఘటనాస్థలానికి  చేరుకుని నిందితుడు తౌసిఫ్ ను  అరెస్టు చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: