జగన్మోహన్ రెడ్డి సర్కార్  తలపెట్టిన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుకు శాసనమండలిలో చుక్కెదురైనా విషయం తెలిసిందే. జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ మెజారిటీ ఉండడంతో సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే శాసన మండలి రద్దు చేయాలంటే... శాసనసభలో తీర్మానం చేసి అనంతరం దాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక గెజిట్ విడుదల అయిన తర్వాత శాసనమండలి రద్దు జరుగుతుంది. 

 

 

 అయితే శాసనమండలి రద్దు  విషయంలో బిజెపి పార్టీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ బీజేపీ నేతలు   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బిజెపి మిత్రపక్షమైన జనసేన కూడా వికేంద్రీకరణ వ్యతిరేకిస్తోంది. కానీ కేంద్రంలోని బిజెపి నేతలు మాత్రం వికేంద్రీకరణపై  ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తుంటే పార్లమెంటులో బిజెపి శాసనమండలికి రద్దు కు మద్దతు తెలిపితే బీజేపీ  పార్టీ ఇరుకున పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

 

 ఎలాగంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ బిల్లును తీవ్ర స్థాయిలో బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.. అదే సమయంలో పార్లమెంట్ లో శాసన మండలి రద్దు  కు కు బిజెపి ఆమోదం తెలిపితే... అప్పుడు టిడిపికి బిజెపి ని విమర్శించే అవకాశం దక్కుతుంది. వైసీపీ పార్టీకి బిజెపి పార్టీకి ఉన్న మితృత్వం ఇదేనంటూ టిడిపి ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కూడా లేక పోలీసు అంటున్నారు రాజకీయనిపుణులు . ప్రత్యేక హోదా పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన బిజెపి పార్టీ మరోసారి వికేంద్రీకరణ కు వ్యతిరేకత తెలుపుతున్నట్లు నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తోందని టిడిపి పార్టీ ఆరోపించే  అవకాశాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ ఇరకాటంలో పడ్డ ట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: