మున్సిపల్  ఎన్నికలు ముగిశాయి.  రేపటి రోజున ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ రాబోతున్నాయి.  రాష్ట్రంలో 1260 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల్లో తెరాస పార్టీతో పాటుగా అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి.  ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాయని అంటున్నారు.  ప్రతి పక్షాలు కూడా విజయం తమదే అంటున్నారు.  9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి మాత్రం నిజాంపేట కార్పొరేషన్ పై ఉన్నది.

 
ఇకపోతే, నిజాంపేట కార్పొరేషన్లో 33 డివిజన్లలో పోలైన ఓటింగ్ శాతం 39.65శాతం మాత్రమే ఉన్నది.  ఒక్కో డివిజన్ లో 3000 వేలకు పైగా ఓటర్లు ఉండగా,కనీసం 1200 నుంచి 1500 ఓట్లు పడితే విజయం సాధించినట్టే అనే అంచనాలు ఉన్నాయి.  కానీ, బుధవారం రోజున జరిగిన పోలింగ్ లో కొన్ని వార్డుల్లో కేవలం 800, మరికొన్ని వార్డుల్లో 900 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  


అయితే, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నువ్వా నేనా అన్నట్లుగా బరిలోకి దిగారు. అదేస్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు. ఒక్కో అభ్యర్థి కనీసం తమ డివిజన్లలో రూ. 20 లక్షలకు తగ్గకుండా ఖర్చు చేశారు. ఒక్కో ఓటుకు కనీసం రూ. 2000 నుంచి రూ. 5000 వరకు డబ్బు ఖర్చు చేశారు.  డబ్బులు పంచినప్పటికీ కూడా అభ్యర్థులు ఓటు వేసేందుకు ముందుకు రాలేదట.  కేవలం 900 మంది మాత్రమే ఓటు వేసేందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.  


అయితే, కనీసం అభ్యర్ధికి 450 ఓట్లు వస్తే విజయం సాధించినట్టే.  అయితే, నిజాంపేటలోని ప్రధాన పార్టీలు కనీసం 1500 మంది ఓటర్లను లక్ష్యంగా చేసుకొని డబ్బులు పంపిణీ చేశారు.  ఎన్నో ఊహలతో డబ్బులు పంపిణి చేస్తే, ఇలా జరిగిందేంటని అంటున్నారు. ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తులు భారీగా ఖర్చు చేసినా లాభం లేకపోయిందని వాపోతున్నారు.  మొత్తంమీద డబ్బులు ఖర్చు చేసినా, తక్కువ ఓటింగ్ జరగడంతో పాపం అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: