ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు మంచి అవకాశాలే వస్తున్నాయ్.. అయితే ఆ అవకాశాలను నిరుద్యోగులే సరిగ్గా వినియోగించుకోవటం లేదు అని అంటున్నారు కొందరు. అయితే ఇప్పుడు తాజాగా నిరుద్యోగులకు వచ్చిన అవకాశం వింటే ఎగిరిగంతేస్తారు... అంత గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా?

 

అదేనండీ బాబు.. చెన్నై ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ఇండియ‌న్ బ్యాంక్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీతో పాటు.. తగిన అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఎంపిక విధానం రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. 

 

ఈ ​పోస్టుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు 138, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ పోస్టులు 85, మేనేజ‌ర్ పోస్టులు 15, సెక్యూరిటీ మేనేజ‌ర్ పోస్టులు 15, ఫోరెక్స్ మేనేజ‌ర్ పోస్టులు 10, లీగల్ మేనేజ‌ర్ పోస్టులు 2, డీలర్ మేనేజ‌ర్ పోస్టులు 5, రిస్క్ మేనేజ్మెంట్  మేనేజ‌ర్ పోస్టులు 5, రిస్క్ మేనేజ్‌మెంట్ సీనియర్ మేనేజ‌ర్ పోస్టు 1 ఉన్నాయి. 

 

కాగా ఈ పోస్టులకు అర్హత.. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కొన్ని పోస్టులకు డిగ్రీ, మరికొన్ని పోస్టులకు డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి. అన్ని పోస్టులకు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ పోస్టులకు వయోపరిమితి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20-30 సంవత్సరాలు, మేనేజర్ పోస్టులకు 25-35 సంవత్సరాలు అలాగే సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

 

కాగా ఈ పోస్టులకు దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు ఎంపిక విధానం రాతపరీక్ష, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇంకా ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 22 జనవరి 2020 ప్రారంభం అయ్యి 10 ఫిబ్రవరి 2020న ముగుస్తుంది. ఇంకా ఈ పోస్టులకు ప‌రీక్షతేది మర్చి 8వ తేదీన జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: