టిడిపి అధినేత చంద్రబాబు ఎంత రాజకీయ మేధావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్టు గా ఆయన రాజకీయాలను నడిపిస్తూ ఉంటారు. తాను అధికార పక్షం లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ రాజకీయ జీవితానికి ఏ ఢోకా లేకుండా చూసుకుంటారు. తమ రాజకీయ ప్రత్యర్ధులు ఎప్పుడు ఏ ఎత్తులు వేస్తున్నారు ?  రాజకీయంగా ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు తెగ ఆరాట పడుతూ ఉంటారు. దానిలో భాగంగానే తమ పార్టీకి చెందిన నాయకులను ఇతర పార్టీలు ఇతర పార్టీల్లోకి పంపించి అక్కడి విషయాలను కూపీ లాగుతూ ఉంటారు. ఇప్పటికే బిజెపిలో చేరిన రాజ్యసభ ఎంపీలు ఆ విధంగానే బీజేపీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేర వేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. 


ఇక ఏపీ అధికార పార్టీ వైసిపిలోనూ చంద్రబాబు కోవర్టులు ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఈ వ్యవహారంపై జగన్ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు సమాచారం. వైసీపీలో కీలక నాయకులు మధ్య జరిగే జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు టిడిపి అధినేతకు కొంతమంది వ్యక్తులు చేరవేస్తున్నట్టుగా వైసిపి నిఘాలో  లో తేలిందట. ఈ విషయం ముందు నుంచి తెలిసినా వైసీపీ పెద్దలు చూసి చూడనట్టుగా  పట్టించుకోకపోవడంపై జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.


 పార్టీలో జరిగే ఇటువంటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాటిని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ చుట్టూ ఉన్న నాయకులు చాలామంది టిడిపి కోసం పని చేస్తున్నారని, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడు చేసిన వ్యవహారాలపై వైసీపీకి ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు అందుతున్నాయి. అందుకే ఇకపై పార్టీలో ఉన్న కోవర్టుల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, వారిని పార్టీ నుంచి సాగనంపే చర్యలకు జగన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: