రాజకీయం, రాచరికం ఈ రెండిటికి చాలా దగ్గరి పోలికలుంటాయి. రాజకీయంలో పదవి కాపాడుకోవడానికి అడ్దమైన పనులు చేసే నాయకులు ఉండగా. రాచరికాన్ని కాపాడుకోవడానికి రాజ్యాలను కూల్చేసిన రాజులు ఉన్నారు.. ఏదైనా పదవి కోసమే.. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా పలు విదాలైన కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయట.

 

 

మున్సిపల్ ఎలక్షన్స్ ప్రకటించినాక టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు. అభ్యర్థిని ఫైనల్ చేశాక వెన్నుపోటు పొడిస్తే సహించేదిలేదన్నారు. వారి గెలుపు కోసం అందరూ పని చేయాలన్నారు. ఇలాంటి పరిస్దితుల్లో మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు విచ్చల విడిగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు.

 

 

ఇక ఈ ఎన్నికల్లో భారీ మొత్తంలో ధనం, మద్యం  ప్రవాహమై ప్రవహించింది. ఇలాంటి పరిస్దితుల్లో తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మద్యనే హోరా హోరీగా, నువ్వా నేనా అనే చందంగా పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సుమారు 16 వార్డులను కైవసం చేసుకుంటామని, కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం గత ఎన్నికల ఫలితాలను పోల్చుకుని. ఇప్పుడు 17 నుంచి 18 వార్డులను కైవసం చేసుకుంటామనే దైర్యంతో ఉన్నారు. కాగా  ఇప్పుడు గులాభి పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

 

 

అంతే కాకుండా ఒకరికి ఒకరు రాజకీయంగా దెబ్బతీసుకునే ప్రయత్నాలు చేస్తూ, మెసేజీల ద్వారా వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించే పని చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులే చర్చించుకుంటున్నారట. ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీ అయినా తుర్కయంజాల్‌ లో పార్టీకి వ్యతిరేకంగా ఇలాంటి పనులు జరుగుతున్నాయట. ఇకపోతే ఈ ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజారిటీ సాధించుకుని తమకు ఇప్పటికైనా ఎదురులేదని చాటుకోవాలని ఆశపడుతున్న పెద్ద బాస్‌కు ఈ వెన్నుపోటు రాజకీయాలు పెద్ద తలపోటుగా తయారు అవుతున్నాయట. ఎంతైన తాను నేర్చిన విద్యను, తన వారు నేర్వకుండా ఉంటారా అని అనుకుంటున్నారట కొందరు నాయకులు.. ఇక ఈ అధిపత్యపోరులో సాగుతున్న గెలుపు ఓటముల సమాచారం తెలియాలంటే రేపటి వరకు ఆగితే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: