మనీ మనిషిని ఎంతదూరమైనా తీసుకెళ్తుంది.  ఎంత పనినైనా చేయిస్తుంది.  డబ్బుకోసమే మనిషి జీవిస్తున్నాడు.  గాలి లేకుండా మనిషి బ్రతకగలడెమోగాని, డబ్బు లేకుంటే మాత్రం ఒక్క క్షణం కూడా బ్రతకలేడు.  ఇది వాస్తవం.  డబ్బు చుట్టూ మనిషి ప్రదక్షిణాలు చేస్తున్నాడు.  రోజు రోజుకు దేశంలో లైఫ్ స్టైల్ పెరిగిపోతున్నది.  ఆ లైఫ్ స్టైల్ ను అందుకోవడానికి మనిషి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చెప్పక్కర్లేదు.  డబ్బు పిచ్చిలో పడి కొందరు వ్యక్తులు తప్పు మార్గంలో పయనిస్తున్నారు.  


ఇలాంటి సంఘటన ఒకటి ముంబైలో జరిగింది.  పాపం విదేశాల నుంచి ముంబై వచ్చి ముంబై కాలేజీలో చదువుతున్న విదేశీ యువతులను డబ్బు, సినిమా ఆశ చూపించి పడుపు వృత్తిలోకి దించారు.  డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పి ఆ రొంపిలోకి దించి డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు.  ఈ విషయం ఇటీవలే బయటపడింది.  పోలీసులు ఇటీవలే ముంబైలో హోటల్స్ పై రైడ్ చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ముంబై నగరంలో జీవితం చాలా కాస్ట్లీగా ఉంటుంది.  ఆ నేచర్ ను అందుకోవాలి అంటే దానికి తగ్గట్టుగానే పనిచేయాల్సి వస్తుంది.  


దానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది.  దీనికోసం ఎలాంటి పనులు చేయడానికైనా సిద్దపడుతుంటారు.  హ్యాపీగా మంచి లైఫ్ ఉన్న వ్యక్తులు కూడా డబ్బుకోసం ఇలా నరకంలోకి దిగుతుంటారు.  అందులో ఎంత ఆనందం ఉన్నదో తెలియడం లేదు.  ఎందుకు దానికోసం పరుగులు తీస్తున్నారో కూడా తెలియడం లేదు.  డబ్బు మాయలో పడి మనుషులు విలువలు కోల్పోతున్నారు.  


సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ వైపు ఉండే వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతున్నారు.  డబ్బు అవసరం ఉన్న అమ్మాయిలకు వలవేస్తున్నారు.  రొంపిలోకి దించుతున్నారు.  అన్నింటికీ మించి మనిషిని తప్పుడు పనుల వైపుకు నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పనుల్లో ఆరితేరిన ముంబై క్యాస్టింగ్ వ్యక్తులైన అక్తర్, సయ్యద్ అనే వ్యక్తులను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: