ముందు గ్యాంగ్‌ రేప్ అన్నారు. కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశారని చెప్పారు. ఆ తర్వాత అత్యాచారమే జరగలేదని ప్రకటించారు. 24 గంటలు కూడా గడవక ముందే.. రెండు ప్రకటనలు రావడంతో అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ పోలీసులు నిందితుల్ని రక్షిస్తున్నారా..? 


తెలంగాణలో సంచలనం సృస్టించిన అమీన్‌పూర్‌ గ్యాంగ్‌రేప్‌లో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు ప్రకటించడం హాట్ టాపిగ్గా మారింది. బాధితురాలు మాత్రం తనపై రేప్‌ జరిగిందని చెబుతోంది. దీంతో ఈ రెండువాదనల్లో ఏది నిజమన్నది సస్పెన్స్‌గా మారింది. గురువారం మధ్యాహ్నం బాలిక కిరాణ షాపుకు వెళ్లి తిరిగొస్తుండగా...రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ కారులోని ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా లోపలికి ఎక్కించారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న ముగ్గురు.. అమీన్‌పూర్‌కి రెండు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అనంతరం బాలికను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. ఇది తల్లిదండ్రులు చెబుతున్న వాదన. 

 

పోలీసులు చెప్పింది మరోలా ఉంది. బాలికపై అత్యాచారమే జరగలేదంటున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, లైంగిక దాడి జరగలేదని తెలిపారు. తన న్యూడ్ ఫొటోస్ ఉన్నాయని ఓ వ్యక్తి బెదిరించడంతో...బాలిక  బైక్ మీద వెళ్లిందని చెప్పారు. నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు యువకులు వచ్చి లైంగిక దాడికి ప్రయత్నం చేశారు. బాలికను ఐదు గంటలపాటు నిర్భందించారన్నారు. దీంతో వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు

 

అయితే... యువతిని ఎవరు తీసుకెళ్లారన్నది ఇంకా తెలియలేదు. పైగా అమీన్‌పూర్‌లో పవర్‌ హాలీడే కావడంతో సీసీటీవీలు పనిచేయడం లేదని పోలీసులు ప్రకటించడం...అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మొత్తానికి అమిన్ పూర్ అత్యాచారం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఏదీ నిజమో ఏది అబద్దమో తెలియక పలువురు సతమతమవుతున్నారు. ఖాకీలు ప్లేట్ ఫిరాయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: