ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు అంశం తెర మీదకు వచ్చింది. ఇక ఇప్పుడు రాజధాని విషయంలో పార్టీలోనే కాదు రాష్ట్ర ప్రజల్లో కూడా ఎంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే పాలన వికేంద్రీకరణ అవసరమని దీని కోసం 3రాజధానిలు  నిర్మించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఇక అమరావతిని శ్వాసగా ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు జగన్ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. సరైన సమయం కోసం చూసి శాసనమండలిలో జగన్ సర్కార్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు.ఇక అటు  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి నోటా చూసిన రాజధానికి సంబంధించిన మాట వినిపిస్తోంది.

 

 

 దీంతో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాజధాని విషయంలో పార్టీలలోనే  రాష్ట్ర ప్రజలందరిలో  తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అందరూ రాజధానికి సంబంధించిన అంశంపైనే చర్చించుకున్నారు. అయితే ఏపీకి ప్రజా రాజధాని కావాలి... కానీ ఆ రాజధాని ఎక్కడ ఉండాలి అనే దానిపై ఎవరికి మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఒక్క  రాజధాని కాదు మూడు రాజధానులు నిర్మించాలి అని జగన్ సర్కార్ అంటుంటే... రాజధాని అమరావతి లోనే ఉండాలని కొత్త రాష్ట్రానికి రాజధాని ఉండాలని దాన్నే  అభివృద్ధి చేయండి అంటూ టిడిపి పట్టుబడుతోంది. దీంతో అటు ప్రజలు కూడా అయోమయంలో పడిపోయారు. అధికార పార్టీ చెప్పినట్టు రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలా లేకపోతే ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఉంటే సరిపోతుందా... అనే దానిపై గందరగోళం నెలకొంది. 

 

 

 ఇకపోతే రాష్ట్రంలో ఒకటే రాజధాని ఉండాలని అది అమరావతి లోనే ఉండాలని పట్టుబడుతున్న టిడిపి... ప్రజల మధ్యకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలా ఒకటే కొనసాగాలా అనే నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయాలి మంచిదంటున్నారు రాజకీయ నిపుణులు. రాష్ట్రం యొక్క రాజధానికి సంబంధించి ప్రజాభిప్రాయం తీసుకోవటమే ఉత్తమం అని అంటున్నారు. రాజధాని అంశం ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజా రాజధాని వస్తుందని.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ప్రజలే డిసైడ్ చేస్తారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: