గత కొన్ని రోజుల నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సిపిఐ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్  3 రాజధానిల ప్రకటన తెరమీదకు తెచ్చినప్పటినుంచి.. సిపిఐ నేతలు జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ నేతలు నారాయణ, రామకృష్ణ సహా పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా జగన్ కు కొత్త పేరు పెట్టారు సిపిఐ రామకృష్ణ. 

 

 

 

 ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ పేరుతో  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  జగన్ కు  కొత్త పేరు పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు తుగ్లక్ కాదని... జగ్లక్  అంటూ జగన్ పేరును తుగ్లక్ పేరుతో కలిపి కొత్త గా నామకరణం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగ్లక్  తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని రాజధాని సహా వెనకబడిన ప్రాంతాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మూడు రాజధానిల పేరుతో జగన్మోహన్ రెడ్డి  సర్కార్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

 

 

 

 ఏబీఎన్, ఈటీవీ,  టీవీ5 ఛానల్ పై జగన్మోహన్ రెడ్డి  సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని... కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాజధాని ఆందోళనకు సంబంధించిన వార్తలను ప్రచారం చేస్తున్నారనే  నెపంతో మీడియా ప్రతినిధులపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆరోపించారు సిపిఐ రామకృష్ణ. పోలీసుల తోనే ఫిర్యాదులు చేయించి అక్రమంగా కేసులు బనాయించటం  దారుణం అంటూ విమర్శించారు. రిపోర్టర్ల పై జగన్ సర్కార్  పెట్టిన అక్రమ కేసుల విషయంలో డిజిపిని కలిసి మాట్లాడతామని తెలిపారు. మీడియాపై ఆంక్షలు తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించలేరు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: