మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణం కేసులో అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రతివాదిగా చేర్చాలి అంటూ సుప్రీం కోర్టు నిర్ణయించింది. మార్గదర్శి నిబంధనలు ఉల్లంఘించి దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల మేర డిపాజిట్లు సేకరించినది అనే  అభియోగంపై... మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఉత్తర్వులు  జారీ చేసింది. డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకే నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో... డిపాజిట్ దారుల ప్రయోజనాల దృష్ట్యా... వ్యవహారాల పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు రంగాచారరిని  నియమిస్తూ జీవో కూడా జారీ చేసింది. అంతేకాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఆర్బీఐ  చట్టంలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా అప్పటి సిఐడి  అధికారి కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించారు. 

 

 

అయితే 2008 సంవత్సరంలో పూర్తి వివరాలతో నివేదిక దాఖలు చేయగా... దీనికి  సంబంధించి దానిపై విచారణ ఆపేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఒక మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. 2011 సంవత్సరంలో తాము దాఖలు చేసిన పిటిషన్ను విచారించాలని అభ్యర్థించింది మార్గదర్శి ఫైనాన్షియర్స్. విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న సీసీ నెంబర్ కొట్టి వేసింది. ఇక దీనిని సవాలు చేస్తూ ప్రస్తుతం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయవాది కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 

 

 

 కాగా ఈ పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ షా లతో కూడిన  ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని  ఈ విచారణలో భాగస్వామ్యం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం మెమోలు  కూడా దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: