రోజురోజుకి ఉన్న కొద్దీ క్రైమ్‌రేటు పెరుగుతుంది. ఎంత క‌ఠిన‌మైన శిక్ష‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎక్క‌డ జ‌రిగే అన్యాయాలు అక్క‌డ జ‌రుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి కాగారియా జిల్లాలో చోటుచేసుకుంది. మ‌ర‌ర్ ప్రాంతానికి చెందిన కుమారి(23) సింటు కుమార్ దంప‌తులు వేరే ఊరు నుంచి వ‌ల‌స వ‌చ్చి ఇక్క‌డ కూలి ప‌ని చేసుకుని బ్ర‌తుకుతున్నారు. 

 

స‌డెన్‌గా సింటుకుమార్ అక్క‌డ ప‌ని మానేసి శ్రీ ఐశ్వర్య రిఫైనరీ ఆయిల్‌ మిల్‌ పరిశ్రమలో ప‌నికి చేరాడు. గురువారం పనికి వెళ్లకపోవడంతో కాంట్రాక్టర్ సింటుకుమార్‌‌కి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసినా కూడా సింటు కుమార్ స‌మాధాన‌ మివ్వ‌క‌పోవ‌డంతో  ఓ వ్యక్తిని అతడి ఇంటికి పంపించాడు. ఇంట్లో సంగీతకుమారి విగతజీవిగా పడి ఉండటంతో ఆ వ్యక్తి కంగారు పడి వెంటనే కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి  అస‌లు విష‌యం చెప్పాడు. దాంతో టెన్ష‌న్ ప‌డ్డ అత‌డు ఇచ్చిన సమాచారంతో చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి తీసుకు వెళ్ళారు. అక్క‌డ అంతా  పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌లో ఉన్న‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 


స‌డెన్‌గా సింటుకుమార్ క‌నిపించ‌క‌పోవ‌డంతో పోలీసుల అనుమానం అత‌ని మీద‌కెళ్ళింది. అత‌డే భార్య‌ను చంపి ప‌రారై ఉంటాడ‌ని అంద‌రూ అనుమానించారు. దాంతో కూతురు కూడా క‌నిపంచ‌కపోవ‌డంతో ఆ అనుమానానికి మ‌రింత బ‌లం చేకూరింది.  శ్రీ ఐశ్వర్య ఆయిల్‌ మిల్‌ పరిశ్రమ మేనేజర్‌ మనోజ్‌కుమార్‌ ఠాకూర్‌ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అస‌లు ఏం జ‌రిగింది. భార్య‌ను ఎవ‌రు చంపారు. భ‌ర్తే చంపాడా లేక మ‌రేద‌న్నాకోణ‌ముందా అని అస‌లు విష‌యం తెలియాల్సి ఉంది. అస‌లు నేరస్తులు ఎవ‌రో తెలిసే వ‌ర‌కు భ‌ర్త క‌నిపించ‌కపోవ‌డంతో అంద‌రి అనుమానం భార్త‌ వైపే మ‌ళ్ళింది. ఒక‌వేళ అత‌ను ఎలాంటి అఘాయిత్యం చేయ‌క‌పోతే పారిపోవాల్సిన అవ‌స‌రం లేదు. అత‌ను ఎందుకు అక్క‌డి నుంచి పిల్ల‌ను కూడా తీసుకుని పారిపోవ‌ల్సి వ‌చ్చింది అన్న అనుమానాలు ఎక్కువ‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: