టాలీవుడ్ లో సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు కమెడియన్ ఆలీ.  ఆ తర్వాత స్టార్ కమెడియ్ స్థాయికి ఎదిగాడు.  కేవలం కమెడియన్ గానే కాకుండా హీరోగా నటించాడు.  ఓ వైపు హీరోగా నటిస్తూ.. తనదైన కామెడీ మార్క్ చాటుకుంటు తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు.  వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన మార్క్ చాటుకుంటున్నాడు ఆలీ.  ప్రస్తుతం సినిమాలే కాదు రాజకీయాల్లోకి వచ్చిన ఆలీ ఆ మద్య ఏపిలో జరిగిన ఎన్నికల సందర్భంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. 

 

క‌మెడియన్ అలీ ఎన్నికలకు నెల రోజుల ముందు జగన్ కు జై కొట్టారు. ఎవరు మంత్రి పదవి ఇస్తే వారి పార్టీలోనే చేరుతానని ప్రకటించి పార్టీల గడప తొక్కిన అలీ చివరకు చంద్రబాబును కాదని.. జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. అలీ ఎమ్మెల్యే టికెట్ హామీపైనే వైసీపీలో చేరినా.. లాస్ట్ మినట్ లో జగన్ ఇవ్వలేక పోయారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్టులపై జగన్ దృష్టిసారించారు. కమెడియన్ పృథ్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం టీవీ (ఎస్వీబీసీ) చానెల్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవిని మరో సినీ నటుడికి ఇచ్చారు. కానీ జగన్ కు చివరి నిమిషంలో జైకొట్టిన అలీకి జగన్ గద్దెనెక్కి 7 నెలలు అవుతున్నా ఇంతవరకూ పదవి దక్కలేదు.

 

ఈ నేపథ్యంలో అలీ ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ కార్యాలయంలో అలీ ప్రత్యక్షం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత విషయమై బీజేపీ కార్యాలయానికి వెళ్లినట్టు అలీ చెబుతున్నా నమ్మశక్యంగా అనిపించడం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. అలీ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: