బైక్ ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లిన సందర్భంలో కచ్చితంగా తాళం వేసుకొని పార్కింగ్ చేసి షాపింగ్ కానీ ఇంకా ఇతర పనులు చేసుకుంటారు బండి ఎవరు దొంగలించకొండ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొంత మంది దొంగలు అయితే నకిలీ తాళాలతో కొన్ని కొన్ని సార్లు పార్కింగ్ చేసిన బైకులను దొంగిలించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవల కొంతమంది మరీ బరితెగించి మరీ దొంగలు డైరెక్ట్ గా షోరూమ్ లోకి వెళ్లి కొత్త బండి తీసుకుని టెస్ట్ డ్రైవ్ అంటూ షోరూమ్ యజమానులైన వారిని బురిడీ కొట్టించి చోరీ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి రావడం జరిగాయి. అయితే తాజాగా ఇటీవల ఇలాంటి టైపు ఒక ఘటన ఓఎల్ఎక్స్ లో చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన సలామ్‌బిన్‌ ఆలీ తిమిమ్మి అలియాస్‌ సలీమ్‌, పటేల్‌ నగర్‌ అంబర్‌పేటకు చెందిన, మహ్మద్‌ సోహిల్‌ ఇద్దరూ సోదరులు.

 

గత కొంత కాలంగా జల్సాలు, వ్యసనాలకు ఇద్దరు బాగా అలవాటు పడ్డారు. దీనితో చోరీల కోసం కాస్త అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. మేటర్ లోకి వెళ్తే ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన బైకు లను టార్గెట్ చేసుకొని బైక్ యజమానులకు నకిలీ నెంబర్లతో ఫోన్ చేసి అమ్మకానికి పెట్టిన యజమానులను ఫలానా చోటికి రమ్మని ఫోన్ చేసి వారి దగ్గర బండి తీసుకుని టెస్ట్ డ్రైవ్ అంటూ ఏకంగా ఇప్పటివరకు ఐదుగురు దగ్గర చోరీలు చేసినట్లు ఈ విధంగా ఒక బాధితుడు మోసపోవడం తో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం విషయం బయటకు వెలుగులోకి రావడంతో పోలీసులు వారి ఆట కట్టించారు.

 

ఈ ఇద్దరు దొంగలపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీయాక్టు నమోదు చేశారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఇవి జరుగుతున్నాయని గుర్తించారు. ఏ పని చేసుకోక ఇష్టానుసారంగా బ్రతుకుతూ అలవాట్లకు బానిస అయ్యి దొంగలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: