ప్రపంచవ్యాప్తంగా జనవరి 25వ తేదీన ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి నేడు ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఎవరెవరు జన్మించారు ఎవరెవరు మరణించారు అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. 

 

 సోవియట్ యూనియన్ : 1918 జనవరి 25వ తేదీన రష్యన్  సామ్రాజ్యం నుండి వేరుపడి సోవియట్ యూనియన్ గా ఏర్పడింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సోషలిస్టు రాజ్యం సోవియట్ యూనియన్. 

 

 భూకంపం : చీలి  దేశంలో 1939 జనవరి 25వ తేదీన భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో దాదాపు పది వేల మంది మరణించారు. 

 

 భారత గవర్నర్ జనరల్ పదవి రద్దు  : 1950 జనవరి 25వ తేదీన భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేశారు. 1950 జనవరి 26వ తేదీన సరికొత్త రాజ్యాంగాన్ని భారత దేశంలో అమలు చేశారు. 

 హిమాచల్ రాష్ట్రం : 1971 జనవరి 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ను  భారతదేశంలో 18వ రాష్ట్రంగా అవతరించింది. 

 

 కొండవీటి వెంకటకవి జననం : 1918 జనవరి 25వ తేదీన ప్రసిద్ధ కవి అయిన కొండవీటి వెంకట కవి జన్మించారు. హేతువాది చలనచిత్ర సంభాషణలు రచయిత అయిన కొండవీటి వెంకట కవి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. ఈయన అష్టావధానాలు చేశాడు.. నందమూరి తారకరామారావు హీరోగా నటించిన దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాశారు కొండవీటి వెంకట కవి. ఈ చిత్రంతో చలనచిత్ర రంగానికి తొలిసారిగా పరిచయమయ్యారు ఈయన. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర లాంటి పలు చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు కొండవీటి వెంకట కవి. ఈయన కవితలు రచనలకు గాను ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కొండవీటి వెంకటకవి కళాప్రపూర్ణ అనే పురస్కారంతో గౌరవించింది. 

 

 నర్సింగ్ యాదవ్ జనం : ప్రముఖ తెలుగు సినీ నటుడు నరసింగ్ యాదవ్ 1968 జనవరి 25వ తేదీన జన్మించారు. ఈయన  తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే. ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన నర్సింగ్ యాదవ్ తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని ఆకట్టుకునే వాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు నర్సింగ్ యాదవ్. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. మొత్తం 300 సినిమాలకు పైగా నటించాడు నర్సింగ్ యాదవ్. విలన్ గానే కాకుండా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో ఎక్కడ వెండితెరపై కనిపించడం లేదు నర్సింగ్ యాదవ్

 

 

 కవితా కృష్ణమూర్తి జననం : ప్రముఖ సింగర్ అయిన కవితా కృష్ణమూర్తి... 1958 జనవరి 25వ తేదీన జన్మించారు. అతి చిన్న వయసులోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఈమె ప్లేబ్యాక్ సింగర్గా సినీ  ప్రేక్షకులందరికీ కొసమెరుపు. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా బాలీవుడ్ లో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఎన్నో సినిమాల్లో ఈమె అద్భుతమైన పాటలను పాడింది. ఇక ఎంతో మంది కథానాయకలకు డబ్బింగ్ చెప్పింది కవితా కృష్ణమూర్తి. ఎంతో మంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం తో పాటు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడి తన స్వరంతో అందరినీ అలరించింది కవితా కృష్ణమూర్తి. కవితా కృష్ణమూర్తి తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడే ఓ పాట పాడేందుకు అవకాశం వచ్చింది. ఏకంగా 16 భాషల్లో 25వేల సాంగ్స్  పాడింది  కవితా కృష్ణమూర్తి. గ్రేట్ సింగర్ లతా మంగేష్కర్ తో ఎన్నో పాటలు పాడింది కవిత కృష్ణమూర్తి. 

 

 పింగళి వెంకట రామి రెడ్డి మరణం : నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి అయిన పింగళి  వెంకట్రామిరెడ్డి... నిజాం ప్రభువుకు అతి విశ్వాసపాత్రులు. ప్రజలకు అనేక రంగాల్లో సహాయ సహకారాలు అందించి అపారమైన సేవ చేసి  ఎంతో మంది ప్రజల ప్రేమాభిమానాలు చొరగొన్న ప్రజా బంధువు పింగళి వెంకట రామి రెడ్డి. ఈయన 1953 జనవరి 25వ తేదీన మరణించారు.

 

 పెను పాత్రుని ఆదినారాయణరావు మరణం : ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత అయిన ఆదినారాయణరావు 1991 జనవరి 25వ తేదీన మరణించారు. 

 

 జాతీయ ఓటర్ల దినోత్సవం : ప్రతి సంవత్సరం భారతదేశంలో జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటర్లకు ఉన్న హక్కులు ఓటు హక్కు ప్రాధాన్యత ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: