సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ కు షాక్ తగిలింది.  న్యాయస్థానం సీఎం జగన్ ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరగా మినహాయింపునకు నిరాకరించింది. సీఎం జగన్ తనకు బదులుగా జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యే విధంగా పిటిషన్ దాఖలు చేయగా సీబీఐ, ఈడీ కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. 
 
సీబీఐ, ఈడీ కోర్టు ఖచ్చితంగా జగన్ హాజరు కావాలని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం న్యాయస్థానం వ్యక్తిగత హాజరు మినహాయింపు కేసుల్లో పిటిషన్ ను తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ కోర్టులో కూడా సీఎం జగన్ కు షాక్ తగిలింది. ఈడీ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ మొదటి నిందితునిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండటంతో తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేయడంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈడీ తీవ్రమైన ఆర్థిక నేరాలలో నిందితుల హాజరు తప్పనిసరి అని పేర్కొంది. జగన్ తప్పనిసరిగా అన్ని కేసుల విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసింది. ఇటీవలే జగన్ దాఖలు చేసిన పిటిషన్ గురించి వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ ను కొట్టివేయడంతో జగన్ కు షాక్ తగిలింది. 
 
ఈరోజు జరిగిన విచారణ నుండి మినహాయింపు లభించడంతో జగన్ హాజరు కాలేదు. ఈరోజు జరిగిన విచారణకు మిగతా నిందితులైన ఎంపీ విజయసాయి రెడ్డి, పెన్నా ప్రసాద్ రెడ్డి, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హాజరయ్యారు. ఇప్పటికే శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి పంపడంతో ఒకింత అసహనంలో ఉన్న జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు  షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: