సాధారణంగా చేపల కూర తినేప్పుడు గొంతులో ముల్లు గుచ్చుకుంటే మనం ఎంత విలవిలాడిపోతామో తెలిసిందే. అలాంటిది ఒక పెద్ద ముక్కు ఉన్న చేప...ఒక బాలుడి మెడలో గుచ్చుకుని ఓ వైపు నుంచి మరోవైపుకు వచ్చేసింది. అయితే చేప ముక్కు గుచ్చిన బెదరని బాలుడు హాస్పిటల్‌ వరకు ధైర్యంగా ఉండటంతో డాక్టర్లు ఎలాగోలా ఆపరేషన్ చేసి, బాలుడి ప్రాణాలకు ఏం కాకుండా చేప ముక్కు తీసేశారు.

 

ఇక విచిత్రమైన దారుణ ఘటన ఇండోనేషియా దేశంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఇండోనేషియా దేశంలోని సులావేసి దీవికి సంబంధించిన ఓ 16 ఏళ్ల బాలుడు...తన తల్లిదండ్రులతో కలిసి బోటులో చేపల వేటకు వెళ్ళాడు.

 

ఇదే సమయంలో బాలుడు తండ్రి చేపలకు వల వేస్తుండగా... ఓ భారీ ముక్కున నీడిల్ ఫిష్  గాల్లోకి ఎగిరి అతడి మెడకు గుచ్చుకుంది. అయితే ముక్కు పెద్దగా ఉండటంతో....గుచ్చుకోవడమే బాలుడి మెడకు ఇటువైపు నుంచి అటు వైపుకు చేప ముక్కు వచ్చేసింది. అయితే చేప దాడికి బాలుడు నీళ్ళలో పడిపోయిన...అలాగే ఈదుకుంటూ బోటులోకి వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు బోటుని వేగంగా నడిపి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

 

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ చేప అలా గుచ్చుకుని ఉండగానే బాలుడిని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అలా చేయడం వల్లే బాలుడు ప్రాణాలతో ఉన్నాడని, అలా కాదని చేపని లాగేసి ఉంటే ప్రాణాలకు ఇబ్బంది వచ్చేదని అక్కడి డాక్టర్లు చెప్పారు. ఇక రెండు రోజులపాటు చేపని అలాగే మెడకు ఉంచి డాక్టర్లు...మొదట చేపని కట్ చేసి ముక్కు మాత్రమే ఉంచి, తర్వాత దాన్ని కూడా సర్జరీ చేసి తీసేశారు. సర్జరీ చేశాక బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఇక సర్జరీ తర్వాత బాలుడు కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. అయితే ఈ నీడిల్ ఫిష్‌లు ముక్కులు పెద్దగా ఉండటం, ఎక్కువ గాల్లోకి ఎగరడం వల్ల దాని ముక్కు గుచ్చుకుని ఆ దీవిలో పలువురికి గాయాలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: