శాసనమండలి వ్యవహారాల్లో తాను తలదూర్చడం తప్పు అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గ్రహించారా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. శాసనమండలి చైర్మన్ కు గ్యాలరీలో కూర్చుని కనుసైగలతో ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో ముందు నుంచీ కుట్రపూరితంగా ఆలోచిస్తున్న చంద్రబాబునాయుడు దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనేది వాస్తవం.

 

ఈ నేపథ్యంలోనే శాసన సభలో ఆమోదించిన బిల్లు మండలి లో ఏ విధంగానూ ఆమోదం పొందకూడదని భావించి తనకు కుడిభుజంగా భావించే మాజీ మంత్రి మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అడ్డంపెట్టుకుని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మండలిలో ఏ విధంగా అయినా సరే బిల్లు పాస్ అవకూడదు అని భావించి తన బలాన్ని అడ్డం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. మూడు రాజధానులు విషయంలో కేవలం కృష్ణా. గుంటూరు జిల్లాల్లో మాత్రమే వ్యతిరేకత.. అది కూడా కొన్ని గ్రామాల్లో మాత్ర‌మే ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని అందరికీ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో తన పార్టీ నేతల భూములను కాపాడుకోవడానికి బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో బాబు ఉన్నారు. అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై మళ్ళీ విమర్శలు చేస్తూ తాను చేసింది స‌రైనదే అని చెప్పుకునే ప్రయత్నం చేసారు. 

 

ఇక మీడియాను కాపాడాలని ఒక ప్రకటన కూడా చేసి తనకు మీడియా మద్దతు కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బాబోరు అనుకూల మీడియా సైతం రాజ‌ధాని విష‌యంలో తిమ్మిని బ‌మ్మిని చేసి త‌మ అభిమాన నాయ‌కుడికి మ‌ద్ద‌తుగా తీవ్ర‌మైన పోరాటం చేస్తోంది. అయితే విస్తృత‌మైన సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో బాబోరి అనుకూల మీడియా మాట‌ల‌ను కూడా ఎవ్వ‌రు ప‌ట్టించుకునే ప‌రిస్తితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: