తెలుగుదేశం పార్టీ ఇన్నిరోజులు మూడు రాజధానుల బిల్లు గురించి చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఎం.ఏ షరీఫ్ మూడు రాజధానులకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు గురించి స్పష్టతనిచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్లిందని జరుగున్న ప్రచారం తప్పని మండలిలోనే సాంకేతిక కారణాలతో బిల్లు ఆగిపోయిందని బిల్లు గురించి షరీఫ్ స్పష్టతనిచ్చారు.                            
 
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి వెళ్లలేదని సాంకేతిక కారణాలతో కూడిన ప్రక్రియ పూర్తయితే మాత్రమే వెళుతుందని అన్నారు. మండలి ఛైర్మన్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు గురించి స్పష్టతనివ్వటంతో అసలు నిజం బయటకొచ్చింది. కానీ బిల్లు విషయంలో మండలి ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది. సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు అమలు దిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకోవటంపై రాష్ట్ర ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూడు రాజధానుల బిల్లును టీడీపీ అడ్డుకున్న తరువాత రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు చోట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు పలుచోట్ల రాస్తారోకాలు నిర్వహించారు. రాయలసీమ జిల్లాలలో, విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. 
 
మరోవైపు సీఎం జగన్ కూడా మండలి రద్దు దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా...? రద్దు చేయాలా..? అనే అంశం గురించి సీరియస్ గా ఆలోచించాలని చెప్పిన విషయం తెలిసిందే. సోమవారం రోజున మండలి రద్దు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: