నిజంగా ఇలాంటి ఘటనలు కారణంగానే ప్రభుత్వ పాఠశాలాలంటే నమ్మకం పోతుంది.. ప్రభుత్వ బడిలో ఎందుకురా బాబు.. కొంచం డబ్బు ఎక్కువ అయినా పర్వాలేదు కార్పొరేట్ పాఠశాలలో చదివిద్దాం.. మన పిల్లలకు మంచి చదువు చెప్పిద్దాం అని పేద కుటుంబాలు సైతం అంటున్నాయి. 

 

ఎందుకు ? పేద కుటుంబాలు కూడా వారి పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలి అనుకోవడం లేదు.. ఎందుకు? అందులో ఉండే ఇలాంటి టీచర్ల వల్ల. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఎనిమిదో తరగతి చదివిన ఓ వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడి విధులు నిర్వహిస్తున్నాడు . అంతేకాదు అతనికి నెలకు 4 వేల రూపాయిల జీతం ఇస్తున్నారు. 

 

ఏంటి ఎలా అయ్యాడు ఇతను టీచర్ అనుకుంటున్నారా? అవుతాడు.. ఎందుకు అవ్వడు. .దొంగ టీచర్లు ఉన్నంత కాలం ఇలా చదువు రాని వారు కూడా ప్రభుతవ ఉద్యోగులు అయిపోతారు. ఎలా అంటే.. మధ్యప్రదేశ్‌ ఖర్గోనే జిల్లాలోని దేవ్లీ ఏరియాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో రామేశ్వర్‌ రావత్‌, జబ్బర్‌ సింగ్‌ అనే ఇద్దరు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు.

 

అయితే వీరు ఇద్దరు విధులకు హాజరు కాకుండా పాఠశాలలో ఉన్న 23 మంది పిల్లలకు పాఠాలు చెప్పేందుకు 8వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉన్న దయాల్‌ సింగ్‌ అనే వ్యక్తిని టీచర్‌గా నియమించుకున్నారు. అతనికి నెలకు రూ. 4 వేలు జీతం కూడా ఇస్తున్నారు. 15 రోజులకు ఓసారి వచ్చి ఆ ఇద్దరు టీచర్లు అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేసి పోతున్నారు. 

 

అయితే ఆ పాఠశాలకు ఉన్నటుంది జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ రాహుల్‌ చౌహన్‌ గురువారం వచ్చారు.. ఆ సమయంలో ఇద్దరు టీచర్లు లేరు.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు.. దీంతో ఇద్దరు ఉపాధ్యాయల గురించి కలెక్టర్ కు తెలిసి వారిని విధుల నుండి తొలిగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: