ఒకసారి చరిత్రలోకి వెళితే జనవరి 27వ తేదీన ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 టెలివిజన్ : మొట్టమొదటి సారి టెలివిజన్ ను లండన్ లో ప్రదర్శించారు. ఆ తరువాత మిగతా దేశాలకు టెలివిజన్ ప్రసారాలు వ్యాప్తి చెందాయి. 1926 జనవరి 27వ తేదీన టెలివిజన్ ని ప్రదర్శించారు.

 

 హెలికాప్టర్ : 1988 జనవరి 27వ తేదీన భారతదేశం లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు. 

 

 విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి  జననం : ప్రముఖ వేద విద్వాంసులైన విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి 1910 జనవరి 27వ తేదీన జన్మించారు. విశ్వనాథం జగన్నాథ ఘనాపాటి  రాజమండ్రి కీర్తిని ఎంతగానో పెంచారు. నగర చరిత్ర లో అంతర్భాగంగా నిలిచిన ధన్యజీవి విశ్వనాథం జగన్నాథ ఘనాపాటి . ఆయన కంఠస్వరం ఎంతో మధురమైనది. అద్భుతమైన ఉచ్చారణ ఆయన సొంతం . విశ్వనాథ జగన్నాథ గణపాటి  నోటినుంచి వేదాలను వినడానికి అందరూ ఆసక్తి చూపేవారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతులమీదుగా 1961 జులై రెండవ న విద్య వాచస్పతి పురస్కారం అందుకున్నారు విశ్వనాథ జగన్నాథ ఘనాపాటి . ఇక ఆ తర్వాత ఎందరో దేశ ప్రధానులు చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు విశ్వనాథ జగన్నాధ ఘనాపాటి . ఎన్నో బిరుదులు ఎన్నో పురస్కారాలు ఎన్నో సత్కారాలు పొందారు. 

 

 పోతుకూచి సాంబశివరావు జననం : సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసి రచయితగా కవిగా ఎన్నో పురస్కారాలు అందుకున్న వ్యక్తి పోతుకూచి సాంబశివరావు. 1927 జనవరి 27వ తేదీన జన్మించారు ఈయన . తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన పోతుకూచి సాంబశివరావు తన రచనలతో ఎంతో ప్రసిద్ధి చెందారు. కథల రచయితగా నవలా రచయితగా నాటక రచయితగా ఎన్నో రచనలతో  ఎంతో ప్రసిద్ధి చెందారు ఈయన. కవిగా కూడా ఆయన సుప్రసిద్ధుడు. కళాప్రపూర్ణ లాంటి ఎన్నో పురస్కారాలని  కూడా అందుకున్నారు పోతుకూచి సాంబశివరావు. 

 

 చమిందా  వాసు  జననం : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్ చమిందా వాసు  1974 జనవరి 27వ తేదీన జన్మించారు. 1994 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ గా  మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయి ఎన్నో ఏళ్ల పాటు జట్టులో కొనసాగాడు.

 

 డానియెల్ వెట్టోరి జననం : న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి.  ఇతను టెస్టు చరిత్రలో 300 వికెట్లు తీసుకున్న మరియు మూడు వేల పరుగులు సాధించిన ఎనిమిదవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులోనే తొలిసారిగా టెస్ట్ క్రికెట్ న్యూజిలాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించి అతి చిన్న వయసులోనే ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు డానియెల్ వెట్టోరి.  

 

 దాసరి సుబ్రహ్మణ్యం మరణం : చందమామ కథ రచయిత అయిన.. తొలితరం సంపాదకవర్గ సభ్యుడు దాసరి సుబ్రహ్మణ్యం 2010 జనవరి 27వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: