జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబునాయుడు చేతులెత్తేశారు. ఏదో మాయ చేసి శాసనమండలిలో రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి రెఫర్ చేయిస్తు ఛైర్మన్ షరీఫ్ తో ప్రకటన చేయించిన తర్వాత మొదలైన రాజకీయంతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.  మండలి ఛైర్మన్ టిడిపి నేతే కావటంతో మ్యానేజ్ చేసి లేని అధికారాలతో చంద్రబాబు  ఓ ప్రకటన చేయించాశారని బయటపడటంతో అసలు సమస్య మొదలైంది.

 

రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి రెఫర్ చేస్తున్నట్లు ప్రకటించేసి ఛైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు. వెంటనే రాజధాని గ్రామాల్లోని మందడం, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలో చంద్రబాబు, షరీఫ్ ఫొటోలకు పాలాభిషేకాలు జరిగాయి. మందడం గ్రామానికి వెళ్ళిన చంద్రబాబుపై స్ధానికులు పూలవర్షం కురిపించారు. నిజానికి ఇవన్నీ కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నవన్న విషయం చూస్తే  తెలిసిపోతుంది.

 

ఓ నాలుగైదు గ్రామాల్లో సంబరాలు చేసుకున్నా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబుపై జనాలు నిప్పులు చెరుగుతున్నారు.  చంద్రబాబు, షరీఫ్ ఫొటోలను నిప్పుల్లో వేసి కాల్చేశారు. దిష్టిబొమ్మలను తగలబెట్టారు. విశాఖపట్నం ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ ఇంటిపైకి స్ధానికులు పెద్ద ఎత్తున దాడి చేశారు. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో సంబరాలు చేసుకుంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలి చాలా ప్రాంతాలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మండిపోతున్నాయి.

 

సరే  ఈ విషయాలను పక్కనపెడితే శాసనమండలి రద్దు విషయంలో సోమవారం నిర్ణయం తీసుకోవాలని గురువారం అసెంబ్లీలోని అందరూ అభిప్రాయపడ్డారు. దాంతో మండలి రద్దు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న టిడిపిలోని సభ్యులే చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంఎల్సీలు చంద్రబాబుకు ఎదురుతిరిగారు. కనీసం మరో 15 మంది ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.  

 

అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్రలోని టిడిపి నేతలు కూడా చంద్రబాబు రాజకీయాన్ని తప్పు పడుతున్నారట.  రాయలసీమ, ఉత్తరాంధ్రలో పార్టీకి ఇబ్బందే. అదే సమయంలో పార్టీ ఎంఎల్సీలే ఎదురు తిరుగుతున్నారు. అంటే జగన్ రాజకీయ వ్యూహాలను ఛేదించలేక చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం లోపు రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: