ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. కానీ ఆ హక్కులపై ఈ మధ్య కాలంలో కేంద్రం పెత్తనం పెరిగిపోయిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల విషయంలో కూడా కేంద్రం జోక్యం ఉంటే సమాఖ్య స్పూర్తి ఇక ఎక్కడ ఉంటుంది. గతంలో ఏపీకి చెందిన చాలా మంది రాజకీయ నాయకులు సమాఖ్య స్పూర్తి అంటూ నినాదాలు చేశారు. కానీ నేడు వారే కేంద్రం ఏపీ మూడు రాజధానుల బిల్లు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.  
 
కేంద్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. కొన్ని విషయాల్లో కేంద్రానికి, రాష్ట్రానికి కలిపి ఉమ్మడి హక్కులు ఉంటాయి. గతంలో మీడియా కూడా చాలా సందర్భాల్లో సమాఖ్య స్పూర్తి అంటూ ప్రచారం చేసింది. కానీ నేడు అదే మీడియా కేంద్రం మూడు రాజధానుల బిల్లు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉండటం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కొందరు రాజధాని విషయంలో రాష్ట్రానికే పూర్తి అధికారాలు ఉంటాయని కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. 
 
కానీ రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ నాయకులు, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని పదేపదే కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకుంటుందని మూడు రాజధానుల అమలు జరగదని రాజధానిగా అమరావతి మాత్రమే కొనసాగుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధానిని మార్చితే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రాలకు ఉండే హక్కులను విస్మరించి మాట్లాడుతున్నారు. 
 
అన్ని విషయాలకు కేంద్రం జోక్యం చేసుకోవాలి...? కేంద్రం ప్రమేయం ఉండాలి...? అంటే ఇక దేశంలో రాష్ట్రాలు ఎందుకు...? ఆ రాష్ట్రాలకు సీఎంలు ఎందుకు...? గవర్నర్ లు ఎందుకు...? ప్రతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకుంటే ఇక సమాఖ్య స్పూర్తికి అర్థం ఏముంటుందనే అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: