శాసనమండలిలో తలెత్తిన తాజా రాజకీయ పరిణామాలతో  తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల్లో గుబులు మొదలైంది. దాదాపు ఏడాదిన్నర, రెండేళ్ళ కాలపరిమితి ఉన్నప్పటికీ ముందే తమ పదవుల ఆయుష్షు తీరిపోవటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శాసనమండలి రద్దు విషయంలో  అసెంబ్లీలో  జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాలు చెప్పిన తర్వాత మండలి రద్దు దాదాపు ఖాయమని తేలిపోయింది. ఎప్పుడైతే మండలి రద్దు ఖాయమని ప్రచారం మొదలైందో టిడిపి ఎంఎల్సీలందరూ జగన్ తో టచ్ లోకి వస్తున్నారట.

 

58 స్ధానాలున్న శాసనమండలిలో  టిడిపికి ఇపుడు 34 మంది సభ్యులున్నారు. వైసిపికి ఉన్నది తొమ్మిది మందే అన్నది అందరికీ తెలిసిందే. ఇక పిడిఎఫ్, స్వతంత్రులు, బిజెపి సభ్యులు కూడా ఉన్నారు. కొన్ని స్ధానాలు ఖాళీగా ఉన్నాయి.  మండలి గనుక రద్దయితే ఒకేసారి 34 మంది సభ్యులు  ఒక్కసారిగా పదవులు కోల్పోతారు. వీరిలో నారా లోకేష్ తో పాటు  సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళున్నా సమస్యంతా కొత్త నేతలకే.

 

నిజంగా మెజారిటి ఉందన్న కారణంతో శాసనమండలిలో ప్రభుత్వం పంపుతున్న ప్రతి బిల్లును టిడిపి అడ్డుకోవటాన్ని ఆ పార్టీలోని ఎంఎల్సీలే వ్యతిరేకిస్తున్నారు. అయినా చంద్రబాబు, యనమల, లోకేష్ ఎవరిని పట్టించుకోవటం లేదు. తాజాగా మండలిలో సెలక్ట్ కమిటికి పంపుతు ఛైర్మన్ ప్రకటన చేసిన తర్వాత సభ్యుల్లోని అసంతృప్తి ఒక్కసారిగా బయటపడిందట.

 

ఇందులో భాగంగానే పోతుల సునీత, సిద్దార్ధరెడ్డి టిడిపి పై తిరుగుబాటు చేశారు. వీళ్ళబాటలోనే ఇంకా కనీసం పదిమంది ఎంఎల్సీలు నడవాలని అనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసినా అది ఇంకా ఆమోదం కాలేదు.  ఉన్నపళాన తమ పదువులను కోల్పోయేకంటే ఏకమొత్తంగా వైసిపిలో చేరిపోతే ఏ సమస్యా ఉండదనే విషయాన్ని చాలామంది సభ్యులు ఆలోచిస్తున్నారట. మండలి రద్దు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇంకా రెండు రోజులు సమయం ఉంది కాబట్టి ఈలోగాన సంచలనం జరగటం ఖాయమనే అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: