ఒకే ఒక నిర్ణయం ఏపీలో టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకం అయిపోయింది. తన స్వార్ధం కోసం చంద్రబాబు జై అమరావతి అని అనడం వల్ల తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయే పరిస్తితి ఏర్పడింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావడంతో గుడ్డిగా మూడు రాజధానులని వ్యతిరేకించారు. ముఖ్యంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడాన్ని ఆపడంతో అక్కడి ప్రజలు టీడీపీపై కోపంతో రగిలిపోతున్నారు.

 

ఈ క్రమంలోనే తమ రాజకీయ భవిష్యత్ ఏం అవుతుందా? అని విశాఖ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల నుంచే పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చిన్నల్లుడు భరత్ పరిస్తితి ఏంటనేది అర్ధం కాకుండా ఉంది. రానున్న రోజుల్లో అతని భవిష్యత్ ఏం అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.  మామూలుగానే భరత్‌ది రాజకీయ నేపథ్యం గల కుటుంబం ఆయన తాత ఎం‌వి‌వి‌ఎస్ మూర్తి టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఒకసారి విశాఖ ఎంపీగా కూడా పని చేశారు. అలాగే 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి కూడా చేపట్టారు.

 

అయితే 2018లో ఆయన అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హఠాత్తుగా మరణించారు. ఇక తాత మరణంతో రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న భరత్, బాలయ్య, లోకేశ్‌ల సహకారంతో 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగారు. అయితే రాష్టం మొత్తం వైసీపీ గాలి వీయడంతో కేవలం 4 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి ఎం‌వి‌వి సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓడింది స్వల్ప మెజారిటీతోనే కాబట్టి ఈసారి కొంచెం కష్టపడితే విజయం సాధించవచ్చని, వైజాగ్ ‌లో పని చేసుకుంటున్నారు.

 

కానీ హఠాత్తుగా మూడు రాజధానుల నిర్ణయం రావడం, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేద్దామని వైసీపీ ప్రభుత్వం అనుకోవడం, దాన్ని ప్రజలందరూ స్వాగతించడం, చంద్రబాబు వ్యతిరేకించడంతో భరత్ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిపోయింది. ముఖ్యంగా విశాఖ ప్రజలు బాబు పట్ల తీవ్ర వ్యతిరేకిత వ్యక్తం చేస్తుండటంతో రానున్న రోజుల్లో టీడీపీకి భారీ షాకులు తగలడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భరత్ భవిష్యత్తుకు కూడా ఫుల్ స్టాప్ పడిపోయే అవకాశం కూడా ఉందని టాక్ వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: