మనిషికి బ్రతకడానికి ఆక్సిజన్ ఎలాగో....టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికారం అలాగా... ఆయనకు ప్రజలకు మంచి చేయడానికి మనసు రాదు గానీ...అధికారం మాత్రం కావాలి. ఎంతసేపు అధికారం అధికారం...ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం ఇచ్చిన, దాన్ని స్వార్ధానికి ఉపయోగించుకుని, ఐదేళ్లు దాటగానే గద్దె దిగేశారు. ప్రజలు జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకున్న, ఆయనపై కుట్రలు చేస్తూ ముందుకెళుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్న ఈయన మాత్రం ఏదొక రాజకీయం చేస్తూ లబ్దిపొందాలని చూస్తున్నారు.

 

ప్రతివిషయంలోనూ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. ఇక ఆయన మాటలు కూడా అలాగే ఉన్నాయి. తాజాగా మండలి విషయంలో కూడా బాబు మాట్లాడినా మాటలు అలాగే ఉన్నాయి. పైగా అధికారంలోకి వస్తే గత ఐదేళ్లు చేసిన పత్తి యాపారమే మళ్ళీ చేస్తానని చెబుతున్నారు. గత ఐదేళ్లు రాజకీయ నిరుద్యోగులు, పాలన తెలియని చాలామంది నేతలకు ఎమ్మెల్సీలు ఇచ్చి మండలిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు వారే రాష్ట్ర అభివృద్ధికు ఉపయోగపడే మూడు రాజధానులని అడ్డుపడుతున్నారు.

 

ఇక ఆ విషయాన్నే చెబుతూ...మనకు మండలి ఉండటం అవసరమా...దాన్ని తీసేస్తే మంచిదనే ఆలోచన జగన్ చేస్తున్నారు. అలా మండలి రద్దు చేస్తే ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్ తో సహ రాజకీయ నిరుద్యోగులుగా మారిపోతారు. అందుకనే బాబు దీనికి విరుగుడుగా తాను అధికారంలోకి వస్తే మండలిని పునరుద్ధరిస్తానని, మళ్ళీ పదవులు త్యాగం చేసిన వారికి న్యాయం చేస్తానని పత్తి యాపారం మాటలు మాట్లాడుతున్నారు.

 

అయితే భవిష్యత్‌లో పరిస్తితి చూస్తుంటే బాబుకు పత్తి యాపారం చేసే అవకాశం మళ్ళీ దక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషుకులు గుసగుసలాడుకుంటున్నారు. జగన్ ప్రజలకు మేలు చేసే పాలన అందించడం, నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం, ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధికి మూడు రాజధానులు పెట్టనుండటంతో...టీడీపీకి ఇక రాజకీయ భవిష్యత్ ఉండటం కష్టమే అంటున్నారు. అన్నీ అనుకున్నట్లే జరిగితే 2024లో కూడా జగన్ భారీ మెజారిటీతోనే గెలుస్తారని, బాబు మాత్రం రావడం కష్టమని అనుకుంటున్నారు. కాబట్టి బాబు ఎంత డప్పు కొట్టుకున్న ఉపయోగం ఉండదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: