జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయతపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును.. సెలెక్ట్ కమిటీకి పంపించడంతో జగన్ సర్కార్ శాసనమండలి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో శాసన మండలి రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఈనెల 27న సోమవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ భేటీ ఆంధ్ర రాజకీయాల్లో  సంచలనంగా మారింది. అధికార పార్టీలో శాసనమండలిని రద్దు చేయాలన్న అంశంపై ముఖ్యంగా చర్చించనున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో... ఈరోజు భేటీ  పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

 

 సోమవారం ఉదయం 9:30 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక ఇప్పటికే శాసనమండలి తీరుపై  గుర్రుగా ఉన్న ఏపీ ప్రభుత్వం శాసన మండలి రద్దుకు  సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. శాసన మండలి రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని క్యాబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలనే  ఆలోచనలో  జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి సభ్యులు,  చైర్మన్ తీరును  తీవ్రంగా తప్పుబట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోగానే.. దానికి ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు సైతం మద్దతు ప్రకటించారు. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు శాసనమండలిని రద్దు చేస్తే చంద్రబాబుకు కనీసం బలం  కూడా లేకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా లేదు. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు చేస్తే.. అధికార వైసిపి పార్టీని ఎదుర్కోవడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వృధా ప్రయాస గానే  మారనున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: