అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలందరూ వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించారు. అయితే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు పై స్పందించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి ఎమ్మెల్సీల పై ప్రశంసలు కురిపించారు. మంగళగిరిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు... అభివృద్ధి వికేంద్రీకరణ కు వ్యతిరేక తెలిపి సెలెక్ట్ కమిటీకి పంపించిన టీడీపీ ఎమ్మెల్సీల అందరు హీరోల మిగిలిపోయారు ప్రశంసించారు. టిడిపి ఎమ్మెల్యేలు ప్రజల నిర్ణయానికి, నీతి నిజాయితీ కి పట్టం కట్టారు అంటూ కొనియాడారు చంద్రబాబు నాయుడు. 

 

 

 రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ ఎమ్మెల్సీలు పని చేశారు అని వ్యాఖ్యానించిన  చంద్రబాబు నాయుడు... అధికార వైసిపి పార్టీ టిడిపి ఎమ్మెల్సీలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఎన్ని పదవిల  ఆశ చూపినప్పటికీ కూడా... వారు భయపడకుండా ఉక్కు సంకల్పంతో... టిడిపి ఎమ్మెల్సీ లందరూ చూపించిన చొరవ  చరిత్రలో నిలిచిపోతుంది అంటూ చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు. చరిత్రలో టిడిపి ఎమ్మెల్యేలు అందరు హీరోలుగా  మిగిలిపోయారు అంటూ కొనియాడారు.

 

 

 ఈ సందర్భంగా శాసన మండలి రద్దు చేస్తాం అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు... ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శాసనమండలిని రద్దు చేయాలి అనుకుంటే.. ఆ ప్రక్రియ  పూర్తయ్యేసరికి ఒకటిన్నర రెండు సంవత్సరాలు సమయం పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అప్పటి లోపు  టీడీపీ అధికారంలోకి రాగానే దానిని  పునరుద్ధరణ చేస్తామంటూ తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని నీతి నిజాయితీ గా ఉండాలని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి పార్టీ న్యాయం చేస్తోంది అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ పై కూడా ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: