ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  రోజుకో ట్విస్ట్ తెరమీదికి వస్తున్న నేపథ్యంలో... మారుతున్న రాజకీయ పరిణామాల దృశ్య... టీడీఎల్పీ సమావేశం నిర్వహించేందుకు... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. జనవరి 26వ తేదీన టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈరోజు మంగళగిరిలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన... ఎల్లుండి టీడీపీ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీలతో  సమావేశం నిర్వహించబోతున్నామని  చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ఉన్మాద వైసీపీ  ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపై  టిడిఎల్పి సమావేశం లో చర్చించనున్నామనే దానిపై ... వ్యూహ  రచన చేస్తామంటూ తెలిపారు చంద్రబాబు నాయుడు. 

 

 

 ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసిపి సర్కార్ ఫోర్త్ ఎస్టేట్ ను పూర్తిగా చంపేసిందని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు... వైసిపి అరాచకాలు ఏకంగా న్యాయస్థానాలను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చాయి  అంటూ ఆరోపించారు.. మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా దాఖలైన కేసును... ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది ముకుల్ రోహత్గికి  జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. 

 

 

 రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని... ఆంధ్ర ప్రదేశ్ పేద రాష్ట్రం అంటూ చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదికి  మాత్రం ఐదు కోట్ల రూపాయలు ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. ఎంత గొప్ప లాయర్లను  పెట్టుకున్నప్పటికీ వికేంద్రీకరణ కేసుపై... ధర్మం న్యాయం గెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. అధర్మం అన్యాయం లాంటివి తాత్కాలికమేనని... ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అంటూ హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ఏ వ్యక్తి అయినా...  జగన్మోహన్ రెడ్డి  తలపెట్టిన మూడు రాజదానులకు  మద్దతు తెలిపరు  అంటూ వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: