వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మీడియాపై కక్షసాధింపులకు పాల్పడుతోందని,  రాజధాని ఆందోళనలు ప్రసారంచేస్తున్న టీవీఛానళ్లవారిపై నిర్భయచట్టాన్ని మోపడం  దారుణమని, ప్రభుత్వ నిరంకుశచర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మందడంలోని ఓపాఠశాలలో విద్యార్థుల్ని బయటకు పంపి, పోలీసులను ఉంచారని, వారు తరగతిగదుల్లో తమబట్టలు ఉతికి ఆరేసిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాప్రతినిధులపై అక్రమంగా నిర్భయచట్టం కింద కేసులునమోదు చేయడం ప్రభుత్వ నియంత్రత్వ విధానాలకు సంకేతమన్నారు. మహిళాకానిస్టేబుల్‌తో నిర్భయచట్టం కింద కేసుపెట్టించి, విలేకరులను బెదిరించడం  సరికాదన్నారు. జగన్‌ప్రభుత్వం మీడియాను తనచెప్పుచేతుల్లో ఉంచుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.


మండలి ఛైర్మన్‌ షరీఫ్‌పై వైసీపీమంత్రులు దాడికి యత్నించడం, పరుషపదజాలంతో ఆయన్ని దూషించడం, మైనారిటీ నేత, పెద్దవాడని కూడా చూడకుండా అసభ్యపదజాలం వాడటంచూస్తుంటే సభ్యసమాజం ఎక్కడికిపోతోందన్న అనుమానం కలుగుతోందన్నా రు. ముఖ్యమంత్రి తనమంత్రులను కట్టడిచేయకుండా, మరింతగా వారినిరెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి, ఛైర్మన్‌ను దూషించడంపై రవీంద్ర మండిపడ్డారు. మండలిసాక్షిగా విజయసాయి, తదితరులు పెద్దలసభసభ్యుల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చట్టాలను సరిదిద్దేబాధ్యత మండలికి ఉందని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులన్నీ ఆమోదించాల్సిన అవసరం మండలికి లేదన్నారు. రాష్ట్రప్రజల మనోభావాలకు అనుగుణంగానే మండలి నడుచుకుంటుందని, 71సీ నిబంధనప్రకారమే రాజధాని తరలింపుబిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని సెలెక్ట్‌కమిటీకి పంపడం జరిగినట్లు రవీంద్ర పేర్కొన్నారు. కొడాలినాని, బొత్స, వెల్లంపల్లి తదితరులు ఛైర్మన్‌ను ఉద్దేశించి వాడిన బూతులను ఎవరూ ఒప్పుకోరన్నారు.  

 

మండలి చైర్మన్ పై మొన్నటి రోజున మండలిలో మంత్రులు రౌండప్ చేసి దూషించిన సంగతి తెల్సిందే.  మంత్రులు పోడియం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించిన సంగతి తెల్సిందే.  దీంతో సభ అనేకమార్లు వాయిదా పడుతూ వచ్చిన తరువాత మండలి చైర్మన్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించారు.  దీంతో చైర్మన్  తీసుకున్న నిర్ణయాన్ని మంత్రులు, ముఖ్యమంత్రులు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి సైతం చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: