ఒరేయ్ ఆయన్ని ఎవరికైనా చూపించండ్రా... ! అలా వదిలేయకండ్రా 'బాబు' 


అసలు ఆయన బాదేంటో కనుక్కోండ్రా. మాట్లాడితే చాలు 40 ఇయర్స్ ఇండ్రస్ట్రీ అంటాడు కానీ అసలు ఇప్పటి వరకు వరగబెట్టింది ఏమన్నా ఉందా...? ఉంటే అర్జంటుగా చెప్పేయండ్రా నాయన. నా మట్టుకి నేను ఇందాకట్నుంచి అడుగుతూనే ఉన్నా ఎవడూ  సమాధానం చెప్పరేంట్రా ! అవున్లే ఎమన్నా సేత్తే కదా సెప్పడానికి. చాలు చాల్లే మళ్ళీ ఆయన గొప్పతనం పెపంచకం అంతా తెలిసినట్టు ఓకే తెగ బిల్డప్ ఇచ్చేత్తన్నారు మీరు మరర్రో.... ! 

 

ఏంటేహె నువ్వు నీ యాసలు మా బాబునెట్టుకుని తిట్టేట్టన్నావ్ కానీ ... మా బాబు పెపంచ మేధావి తెలుసా నీకు ఆ ఇసయం. ఎక్కడ ఎవరి కాళ్లు ఎలా పట్టుకోవాలో... ఎక్కడ ఒంగాలో... మా బాబొరికి తెలిసినట్టు మీ ఒడికి తెలుసా అసలు. అసలు రెండెకరాల నుంచి వేలకోట్ల కు ఎదిగాడంటే సాల్దా మా బాబు ఎంత గొప్ప మేధావో. ఏ ఇసయం అయినా రెండు రకాలుగా మాట్లాడే ముందు సూపు ఉన్నోడ్రా బాబు. మొన్నటి దాకా ఆ పువ్వు పార్టీ ఒల్లని తిట్టిన తిట్టు తిట్టకుడినా తిట్టాడా ? ఇప్పుడు సూడు ఆల్లనే ఇంద్రుడు సెంద్రుడు అంటూ తెగ పొగిడెత్తన్నాడు. 

 

అవున్లే మీ బాబొరికి సిగ్గు సెరమ్ ఉంటే కదా మళ్ళీ ఆళ్ల కాలికాడికి ఎల్తానంటున్నాడు. ఆళ్ళు ఛీ అవతలికి పో అని కబురంపిత్తున్నా ఆదితోనూ ఈడితోనూ సెప్పించుకుంటున్నాడు. హా సెప్పించుకుంటే నీకేంట్రా అయినా ఒరేయ్ రాజకీయాల్లోకి వచ్చాకా సిగ్గు సెరమ్ ఏంట్రా బాబు. ఆయన్ని ఉంటే ఎలా నెగ్గుకొత్తర్రా బాబా. ఆయన్నీ వదిలేసాడు కాబట్టే కదరా నలభైయేళ్ల నుంచీ ఈ ఇండ్రస్ట్రీలో రెండు ఏళ్ళూ ఊపుకుంటూ  మరీ తిరిగెత్తన్నాడు. 

 

అయినా మీ వోడు తింగరోడెహె లేకపోతే ఏంట్రా మా బాబొరి లా కులాభిమానం సూపించకుండా నీతి, నిజాయితీ, వంకాయ్ అనుకుంటూ రాజకీయాలు సేత్తన్నాడు. ఇక మా సిన బాబొరయితే అప్పనంగా వచ్చిన పదవట్టుకుని మందలగిరి కబుర్లు చెప్పుకుంటూ మా పచ్చ పార్టీని ఏలడానికి సిద్దమయిపోతున్నాడు. దేనికైనా పెట్టి పుట్టల్రో. మొన్న అసెంబ్లీ సూడు కొడాలి కొడవలితో మా బాబొరిని కోసేత్తన్నా నెత్తురు సుక్క కూడా లేకుండా సైలెంట్ గా ఉన్నాడు. అదిరా డిచి ప్లేన్ అంటే... అదిరా రాజకీయం అంటే అదిరా గుండె నిబ్బరం అంటే. ఎన్ని తిట్టినా తట్టుకునే ముసలి గుండెరా అది. మీకు ఎప్పటికి భయపడం రో. ఎందుకంటే మా బాబొరిని ఏమన్నా అంటే ఎవరు ఊరుకున్నా పచ్చ మీడియా ఊరుకోదు రో.... ! సర్లే రా మీ బాబొరి గొప్పతనం ఆయన్ను సూసీ సూసీ మీరంతా బాగానే తయారయ్యారు. గొప్పోల్రా బాబు.   

మరింత సమాచారం తెలుసుకోండి: