ఇటీవల వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడం వెనకాల కోవర్టు రాజకీయం నడిచిందని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో తెలుగుదేశం పార్టీ కోవర్టులు ఉన్నారని ఇందువల్లనే ఈ కోవర్టుల వలనే శాసనమండలిలో పాస్ కావాల్సిన బిల్ ఆగిపోయిందని వైసీపీ పార్టీలో అంతర్గతంగా చర్చ గట్టిగా జరుగుతుంది. ఇదే విషయాన్ని వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టికి ఒక ముఖ్య నేత తీసుకెళ్లారని చాలా ముఖ్యమైన విషయాలను చాలా సిల్లీగా తీసుకున్నాం లైట్ గా తీసుకున్నాం అదే ఇప్పుడు కొంపముంచింది అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో వైఎస్ జగన్ ఎవరైతే తన దృష్టికి ఈ విషయాన్ని తెచ్చారో ఆ ముఖ్య నేతని గట్టిగా నిలదీశారు అంట ముందే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అని సమాచారం. అంతేకాకుండా ఈ విషయాన్ని జగన్ దృష్టికి ఆ ముఖ్యనేత తీసుకెళ్లాలని ప్రయత్నించినా మధ్యలో కొన్ని శక్తులు అడ్డు పడినట్లు దీంతో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఈ విషయాన్ని అప్పట్లో చాలా గట్టిగా చర్చించుకుంటూనట్లు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేత మొదటి నుండి వైయస్ జగన్ వెంట నడిచిన నాయకుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు..

 

జగన్ వెంటే నడుస్తూ ఉన్నాగాని జగన్ తనని కాదని ఈ మధ్యనే వైసీపీలోకి ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్లకి పదవులు ఇవ్వటంతో తన చుట్టూ కోటరీగా వాళ్లని పెట్టుకోవటం తో జగన్ చుట్టూ ఉన్న నాయకులే టీడీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని ముందు నుండి పార్టీ కోసం పని చేసిన నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటూన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలని చూసినా గాని రాజకీయంగా అనేక సమస్యలు ఎదురవుతాయి అన్న కోణంలో పార్టీ కోసం పని చేసిన నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అన్న భయాందోళనలో జగన్ దగ్గరికి వెళ్ళలేక వా పోతున్నట్లు...ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో జగన్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పార్టీ కోసం పని చేసిన సీనియర్ నాయకులు ఇటీవల శాసనమండలిలో జరిగిన విషయం గురించి చర్చించుకుంటున్న సందర్భంలో అంతర్గతంగా కామెంట్లు చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ విషయం బయటపడటంతో తన చుట్టూ ఉన్న ముఖ్యమైన నేతలపై జగన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తనకు ఈ విషయాన్ని తెలియజేసిన ముఖ్య నేతనే తన చుట్టూ ఎవరైతే టీడీపీకి కోవర్టు గా పని చేస్తున్నారో వారి కదలికలపై దృష్టి పెట్టమని చెప్పినట్లుగా టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: