ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేకు కీలక పదవి ఇచ్చారు. గుంటూరు మిర్చి యార్డ్ గౌరవ ఛైర్మన్ గా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన మద్దాలి గిరిని జగన్ నియమించారు. అదే నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి ఏసురత్నంను సీఎం జగన్ మిర్చి యార్డ్ ఛైర్మన్ గా నియమించారు. 
 
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏసురత్నం ఛైర్మన్ పదవి పొందగా టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి గౌరవ ఛైర్మన్ పదవిని పొందారు. కొన్నిరోజుల క్రితం మద్దాలి గిరి సీఎం జగన్ ను కలవడంతో పాటు వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని సీఎం జగన్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితుడినై ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు మద్దాలి గిరి తెలిపారు. 
 
ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన మద్దతు ప్రకటించగా తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి కూడా తన మద్దతును ప్రకటించారు. జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తన మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. 
 
చంద్రబాబును రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేయాలనే ఆలోచనతోనే సీఎం జగన్ మద్దాలి గిరికి గౌరవ ఛైర్మన్ పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మద్దాలి గిరికి పదవి లభించటంతో వల్లభనేని వంశీకి కూడా పదవి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీకి మద్దతు ఇచ్చేవారికి పదవులు ఇవ్వడం ద్వారా పార్టీకి మద్దతు ఇచ్చేవారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: