నగరంలో రిపబ్లిక్ డే వేడుకలకు హడావుడి మొదలైంది. ఇందుకు గాను అన్ని స్కూళ్లు సిద్దమవుతున్నాయి. ఇక ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మీకూ ఏమైనా అర్జెంట్ పనులుంటే ఇక్కడ సూచించే సమయాల్లో, అందులో ఈ ప్రాంతాల వైపు అసలే వెళ్లకండి.

 

 

ఎందుకంటే మీరు వెళ్లినా, ఈ దారుల గుండా అక్కడి అధికారులు వెళ్లనీయరు. సరికదా అక్కడి వరకు వెళ్లినాక ఆ దారులు మూసి ఉంటాయి. అందువల్ల మీకు సమయం వృధా అవడమే కాదు. చుట్టూ తిరగవలసిన పరిస్దితులు తలెత్తవచ్చూ. ఇక ఏ ప్రాంతాల్లో ఇలాంటి రూల్స్ ఫాలో చేస్తున్నారో తెలుసుకుంటే. ముఖ్యంగా కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా కొన్ని సమయాల్లో మాత్రమే ఈ రూట్లో అనుమతులు ఇస్తారట.

 

 

అదేమంటే కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఏఓసీ సెంటర్‌లోకి ప్రవేశించే మార్గాన్ని తాత్కాలికంగా బంద్ చేస్తున్నారట. అవేమంటే కిర్కి గేట్‌, స్టార్‌ అండ్‌ గో బేకరి, సఫిల్‌గూడ గేట్‌, మహింద్రా హిల్స్‌ చెక్‌పోస్టు(మారేడ్‌పల్లి ట్రాఫిక్‌ ఠాణా పరిధి), కేంద్రియ విద్యాలయం మూసివేస్తున్నట్లు ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు.

 

 

ఈ రోజుల్లో. ఈ సమయాల్లో అంటే 24వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు, 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26వే తేదీ ఉదయం 6 గంటల వరకు, 26వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో ఉన్న అన్ని గేట్లను మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు..

 

 

కావునా ఈ రూట్లో ప్రయానించే వాహన చోదకులు వేరే రూట్లో వెళ్లగలరని వారు తెలిపారు. తిరిగి 27 వ తేది నుండి యధాతధంగా ఈ మార్గాలు పనిచేయనున్నాయి.. కావున వాహనదారులు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి జాగ్రత్తపడగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: