గురువారం రోజు సభలో అనేక విషయాలను చర్చించారు. ముఖ్యంగా శాసనమండలి రద్దుపై కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నారు. దానికి అనుగుణంగానే సభ నడిచింది. గురువారం నాటి విషయాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి చర్చించి సోమవారం నిర్ణయం తీసుకుంటారు.  ఈ నిర్ణయం బట్టే శాసనమండలి ఉండాలా లేదా అన్నది తేలిపోతుంది.  ఒకవేళ మంత్రులు మండలి ఉండాలి అని పట్టుబడితే ఉండొచ్చు.  ఎలానో సెలక్ట్ కమిటీ నుంచి మరో మూడు నాలుగు నెలల్లోగా దీనికి సంబంధించిన విషయం బయటకు వస్తుంది.  

 

అది వచ్చిన తరువాత అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, సెలక్ట్ కమిటీ నుంచివైకాపా మంత్రులుఉంటారు.  అలానే, మెంబర్లుగా శాసనమండలిలోని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్సీలు ఉంటారు.  వారికీ బిల్లు  అర్ధమయ్యేలా వివరిస్తే చాలు.  వాళ్ళు అర్ధం చేసుకుంటే అన్ని సర్దుకుంటాయి.  కాకపోతే అర్ధం చేసుకుంటారా లేదా అన్నది చూడాల్సిన అంశం.  అర్ధం చేసుకుంటే అన్నింటిని అర్ధం చేసుకుంటారు.  లేదంటే బిల్లు గొడవ మరలా రచ్చరచ్చ అవుతుంది.  


అందుకే సోమ, మంగళవారంతో సభను పూర్తిచేసి, ఓ నిర్ణయం తీసుకుంటారు.  దీని ఫిబ్రవరిలో మరలా బడ్జెట్  సమావేశాలు ఉంటాయి.  ఆ సమావేశాల అనంతరం  సెక్రటేరియట్ మార్చే అవకాశం ఉంటుంది.  ఉగాది నుంచే దీనిని మార్చాలి అని పట్టుబట్ట బోతున్నారు.  అక్కడ అసలేం జరుగుతుందో అని భయపడుతున్నారు.   దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ప్రభుత్వానికి ఉన్నది కొన్ని రోజుల సమయం మాత్రమే.  ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. 


ఇకపోతే, మండలిలో సభను సజావుగా జరగకుండా అడ్డుకున్న నేతలపై ప్రజలు మండిపడుతున్నారు.  మండలిలో అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్సీలపై వైకాపానేతలు సైతం మండిపడుతున్నారు.  తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో టీడీపీకి వ్యతిరేకంగా ర్యాలీలు జరుగుతున్నాయి.  అయితే, ఆంధ్రప్రాంతంలో మాత్రం తెలుగుదేశానికి అనుకూలంగా ర్యాలీలు చేస్తున్నారు.  ఇకపోతే, ఫిబ్రవరి 2 వ తేదీన విజయవాడలో జనసేన భారీ ర్యాలీ నిర్వహించబోతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: