జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లాన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఆర్ధికంగా సహాయ పడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఎప్పటి నుండో షాక్ ఇస్తూ వస్తుంది ఈ నెట్వర్క్..

 

అలాంటి ఏఈ జియో మరో సంచలనానికి రెడీ అవుతుంది.. ఆ సంచలనం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి బాబు.. అతి త్వరలోనే 5జి అతి తక్కువ ధరలో ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు చైనాకు చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ మేకర్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. 5జి సేవలకు సంబంధించి రిలయన్స్ జియో నెట్‌వర్క్ ఇప్పటికే సిద్ధమైనట్టు ఆయన చెప్పారు. 

 

అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లు మధ్యతరగతి వారికోసం తీసుకురావాలని జియో ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సత్తా కూడా జియోకి ఉంది అని ట్రాన్సిషన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తాలపత్ర కూడా చెప్పుకొచ్చారు. జియో తీసుకొచ్చే ఫోన్లలో 'చవక' అనేది చాలా ముఖ్యమైన విషయం కానుందన్నారు.

 

ఇంకా మన దేశంలో ఇప్పుడిప్పుడే 5జి వస్తుంది. అలాంటి ఈ నేపథ్యంలోనే టెలికం కంపెనీలు అన్నింటి కంటే ఇది పెద్ద పెట్టుబడి అని అరిజిత్ చెప్పుకొచ్చారు. అయితే ఒకసారి 5జి నెట్‌వర్క్‌ను చూసిన తర్వాత కనీసం రూ.15 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఇండస్ట్రీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అన్నారు. 

 

2021లో ఈ 5జి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా 2016లో కూడా 4జి సర్వీస్ తో జియో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 5జితో దూసుకొచ్చి సంచలనం సృష్టించనుంది. మరి ఇది ఎంతవరుకు వినియోగదారులకు చేరుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: