తెలుగుదేశం పార్టీ మండలిలో తెలివిగా వ్యవహరించి కొన్న బిల్లును అడ్డుకున్న సంగతి తెలిసిందే.  బిల్లు విషయంలో మండలిలో ఆ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదో చూశాం.  ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ తనకు బలం ఉండటంతో మండలిలో అడ్డుకున్నది.  మండలిలో అడ్డుకోవడంతో వైకాపా ఇరకాటంలో పడింది.  దీనిని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ తిరిగి బలం పుంజుకోవాలని చూస్తున్నది.  


కానీ, తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలను అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నది.  ఇందులో భాగంగా వైకాపా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది.  ఈ నిర్ణయాల ప్రకారం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, సదస్సులు చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.  ఈ నెల 25 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ర్యాలీలు, సదస్సులు ఏర్పాటు చేయబోతున్నారు.  25 వ తేదీన పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అన్ని విశ్వవిద్యాలయాల వద్ద చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల ద‌హ‌నం. 


జనవరి 27 వ తేదీన యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీలు, పాద‌యాత్ర‌లు. జనవరి 28 వ తేదీన పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి - వికేంద్రీక‌ర‌ణపై యూనివ‌ర్సిటీల వ‌ద్ద స‌ద‌స్సులు నిర్వ‌హ‌ణ‌. అలానే జనవరి 29 వ తేదీన పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో సంత‌కాల సేక‌ర‌ణ‌. అదే విధంగా జనవరి 30 వ తేదీన వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో టీడీపీ తీరుపై రాష్ట్రప‌తికి పోస్టుకార్డులు పంపే ఉద్య‌మ కార్యక్రమాలు చేపట్టుతున్నారు.  


అంతేకాకుండా జనవరి 31 వ తేదీన తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మూడు ప్రాంతాల జేఏసీ నాయ‌కుల సమావేశం జరుగుతుంది.  దీంతో పాటు అన్ని ప్రాంతాలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి వైకాపా సిద్ధం అవుతున్నది.  తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాటు చేసుకుంది.  యువతను, రైతులను, మహిళను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని అనుకుంటోంది.  మరి చూద్దాం ఏమౌతుందో.  ప్రజలు ఎలా భాగస్వామ్యం చేస్తారో చూడండి.   

మరింత సమాచారం తెలుసుకోండి: