ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి అడిగినపుడు వ్యతిరేకంగా  రెచ్చిపోయారు. జగన్ హాజరుకు మినహాయింపిస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్న సిబిఐ వాదనకు మద్దతుగా అనేక కథనాలు వండి వార్చారు.  ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవ్వటాన్ని రెచ్చిపోయి కవర్ చేస్తున్నారు. మరిపుడు తన కేసుల్లో విచారణ నుండి తనకు మాత్రం మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

 

ఇంతకీ ఈ కథంతో ఎవరి గురించో అర్ధమైపోయుంటుంది. అవును ఆయనే ఈనాడు  మీడియా  చీఫ్ ఎడిటర్ రామోజీరావు.  తన కేసుల విచారణలో  వ్యక్తిగత మినహాయింపు ఇవ్వమని జగన్ అడగటమే మహా పాపమన్నట్లుగా కథనాల్లో రాస్తున్నారు. మరి తనకు మాత్రం మినహాయింపు ఎందుకు అడిగారు ? పైగా ఉమ్మడి హైకోర్టు విభజన జరిగే చివరి రోజున విషయం బయటకు పొక్కకుండా మ్యానేజ్ చేసుకుని విచారణలో వ్యక్తిగత మినహాయింపు తెచ్చుసుకున్నారు.

 

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో  రామోజీరావు ను మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ నీడలాగ వెంటాడుతున్నారు. అసలు రిజర్వుబ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సంస్ధ జనాల నుండి వేల కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించిందనే తీగను లాగిందే ఉండవల్లి.  సాక్ష్యాధారాలతో సహా  కోర్టులో అడ్డంగా దొరికిపోయిన రామోజీ  వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి ముడేస్తు కేసు విచారణను ముందుకు పోనీకుండా అడ్డం పడుతున్నారు. మరి ఇదే పనిని ఇంకెవరైనా చేస్తే మాత్రం న్యాయదేవతకే అపచారం జరిగిపోయినట్లు పుంఖాను పుంఖానుగా అచ్చేసొదుల్తారు.

 

ఇదే  విషయాన్ని తాజాగా ఉండవల్లి మాట్లాడుతూ చిట్ ఫండ్ మోసం కేసులో  ఆంధ్రా ప్రభుత్వానికి  తెలియకుండా కేవలం తెలంగాణా ప్రభుత్వాన్ని మాత్రమే భాగస్వామిని చేసి విచారణలో వ్యక్తిగత మినహాయింపును తెచ్చుకున్నట్లు రామోజీపై విరుచుకుపడ్డారు. కేసు విచారణలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకూడదన్న తన వాదనతో కోర్టు ఏకీభవించి తెలంగాణా, ఏపి, రామోజీ, ఆర్బిఐ ఉన్నతాధికారులకు నోటీసులిచ్చినట్లు చెప్పారు.  మార్గదర్శి కేసులో రామోజీకి సుమారు రూ. 7 వేల కోట్ల జరిగామానా, జైలుశిక్ష పడటం ఖాయమని ఉండవల్లి చెప్పటం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: