రాజకీయంగా ప్రత్యర్ధులపై పై చేయి సాధించేందుకు రాజకీయపార్టీలు అనేక ఎత్తులు పై ఎత్తులు వేయటం సహజమే. ఆధిపత్యం కోసం అనేక మార్గాలను అవలంభిస్తుంటారని అందరికీ తెలిసిందే. ఇందులో పదవులు, డబ్బు, కాంట్రాక్టులను కూడా ఎరేస్తుంటారు. కానీ సొంత వాళ్ళనే  డబ్బుతో ప్రలోభ పెట్టటం ఎప్పుడైనా చూశారా ? లేదుకదా చూడండి ఇపుడు చంద్రబాబునాయుడు ఇదే చేస్తున్నారిపుడు.

 

తన వాళ్ళు చేజారిపోకుండా చివరకు సొంత ఎంఎల్సీలకు కూడా చంద్రబాబునాయుడు డబ్బు ఎరేస్తున్నారా ? ఎల్లోమీడియాలో వచ్చిన కథనాల ప్రకారం చూస్తుంటే ఇపుడిదే అనుమానం అందరిలోను పెరిగిపోతోంది. శాసనమండలిలో ఆధిపత్యం కోసం అధికారపార్టీ టిడిపి ఎంఎల్సీలకు ఎరేస్తోందని ఎల్లోమీడియా  ప్రముఖంగా ఓ కథనం అచ్చేసింది.

 

సరే రాజకీయంగా ఇదంతా మామూలే అని సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఇలాంటివి చాలానే చేశారు. కానీ అధికారపార్టీ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇపుడు  చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఒకవేళ మండలి గనుక రద్దయితే మిగిలిన కాలానికి ఎంఎల్సీలకు అందాల్సిన వేతనాల డబ్బును పార్టీయే చెల్లిస్తుందంటూ హామీ ఇస్తున్నారు.

 

అంటే ఉదాహరణగా చెప్పాలంటే మండలి రద్దయ్యేనాటికి కొందరు ఎంఎల్సీలకు మరో ఏడాదిన్నర కాలపరిమితి ఉందని అనుకుందాం. నెలకు సుమారు రూ.  2.5 లక్షలు వేతనం రూపంలో అందుతోందని అనుకుందాం. అంటే ఏడాదికి  సుమారు రూ. 30 లక్షలు. ఏడాదిన్నర వేతనమంటే దాదాపు రూ. 45 లక్షలు. అంటే ఈ మొత్తాన్ని వైసిపిలోకి పోకుండా ఉన్న  ఎంఎల్సీలకు పార్టీ నుండే చెల్లిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నాడు.

 

మరి నెల నెలా చెల్లిస్తాడా ? ఏడాదికి ఒకేసారి ఇస్తాడా ? లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ చేస్తాడా ? అన్న విషయంలో స్పష్టత లేదు. అలాగే ఇతరత్రా ఆర్ధిక ప్రయోజనాలను కూడా తాను చూసుకుంటానని హామీ ఇస్తున్నారు. అంటే ఇది కూడా ప్రలోభాలు పెట్టటం క్రిందకే వస్తుంది. అంటే వైసిపిలోకి వెళితే మండలి కంటిన్యు అవుతుంది వెళ్ళకపోతే డబ్బే డబ్బే. నిజంగా టిడిపి ఎంఎల్సీలకు బంపర్ ఆఫరే అఫర్లు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: