ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవగా.. అభ్యర్థులందరూ ఓటర్ మహాశయుల ను  ఆకట్టుకునేందుకు బరిలోకి దిగే సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని బిజెపి పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఎందుకంటే బిజెపి పార్టీ కేంద్ర మొత్తంలో చాలా  రాష్ట్రాల్లో అధికారంలో ఉండి  కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రాజధాని ఢిల్లీలో మాత్రం అధికారం దక్కలేదు బిజెపికి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళురుతుంది బిజెపి పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు మరింత పెరుగుతూ వస్తోంది. 

 

 

 అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎన్నో హామీల వర్షం కురిపిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఈ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్న ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పోటీ చేయడం కోసం ఏకంగా 88 మండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఈ అంశం ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం గా మారింది. నామినేషన్ దాఖలు చేసిన 88 మందిలో 54 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం 34 మంది మాత్రమే బరిలో మిగిలారు. ఈ 34 మందిలో 28 మంది మాత్రమే పోటీ పడుతున్నట్లు సమాచారం. 

 

 

 ఇకపోతే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు  ప్రత్యర్థిగా బరిలోకి దిగిన వారిలో అందరూ డ్రైవర్లు కండక్టర్లు సన్యాసులు కూడా ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయా అభ్యర్థుల పార్టీ పేర్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పేరును పోలి ఉండడం విశేషం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పోటీగా అంజన్ ఆద్మి పార్టీ కూడా బరిలోకి దిగింది. ఆ పార్టీ నుంచి శైలేంద్ర సింగ్ కేజ్రీవాల్ కు  ప్రత్యర్థిగా పోటీపడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు  వ్యతిరేకంగా బరిలోకి దిగిన పార్టీలో భారతీయ లోక్ తాంత్రిక్ పార్టీ,  పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియావిజయ్ భారత్  పార్టీ, రైట్ టు రీకాల్ పార్టీ,  రాష్ట్రీయ రాష్ట్రవాది  పార్టీ లాంటివి ఉన్నాయి. కాగా ఢిల్లీ సీటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు ఎంతవరకు ఓటర్లను ఆకట్టుకుని  విజయం సాధిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: