తన పరిపాలన ప్రజారంజకంగా ఉండాలని భావిస్తున్న ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అందరికీ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ముందుగా జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలు ప్రతిపక్షాలకు పెద్ద కలిగించాయి. అంతటితో ఆగకుండా అమరావతి రాజధానిగా ఉంచుతూనే మరో రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు జగన్. అయితే ఇప్పుడు అధికారులకు షాక్ ఇచ్చే పనిలో పడ్డారు. తాజాగా జగన్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు అధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తాను ప్రజల్లోనే ఉంటానని, తన పరిపాలనపై వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాను  అంటూ జగన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.


 రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది జగన్ సంకల్పం. ఉగాది నాటికి ఈ కార్యక్రమం పూర్తవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అమ్మ ఒడి పథకం తర్వాత జగన్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకుని పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ, వార్డు వాలంటీర్ చెప్పిన విషయాలన్నీ లెక్కలోకి తీసుకుని పట్టాలు  ఇవ్వాలని జగన్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టారు. అలాగే ఫిబ్రవరి 01 నుంచి జగన్ ప్రజల్లోకి వెళుతుండటంతో పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు అధికారులు పగడ్బందీగా అన్ని పథకాలు ప్రజలకు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు అర్హులు ఎవరు అన్న విషయాలను ఇప్పుడు గ్రామ సచివాలయంలోని డిస్ప్లే బోర్డుల్లో ప్రదర్శించబోతున్నారు. ఎవరైనా అర్హులకు బోర్డులో తమ పేరు కనిపించకపోతే గ్రామ వాలంటీర్లకు తెలియజేసి అర్హుల జాబితాలో తమ పేరు ఎందుకు లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని వాలంటీర్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే లబ్ధిదారులకు కేటాయించిన స్థలం నచ్చకపోతే మరో ప్రాంతంలో స్థలం కావాలని వారు అధికారులకు చెబితే అధికారులు లబ్ధిదారులు కోరినట్లుగా స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తారు. 


ఈ విధంగా చేయమని జగన్ నుంచి కూడా అధికారులకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఉగాది నాటికి ఇంటి స్థలం లేని వారు ఎవరు ఉండకూడదు అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థలం కేటాయించడమే కాకుండా వారికి ఇళ్లు కూడా ప్రభుత్వమే కట్టిస్తుంది. నిర్మాణం పూర్తయిన వెంటనే లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండేందుకు వెళ్లాల్సి ఉంటుంది .ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జగన్ ఏ ప్రాంతానికి ఆకస్మికంగా వెళ్తారో తెలియని పరిస్థితి ఉండడంతో అధికారుల్లో పారదర్శకత పెరిగి అన్ని ప్రాంతాల్లోనూ అలెర్ట్ గా ఉంటారని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: