జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. నిజానికి మొదట్లో జగన్ ప్రతిపాదనకు కన్నా మద్దతిచ్చారు. అయితే ఏమైందో ఏమో మరుసటి రోజు నుండి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అసలు జగన్ ప్రతిపాదనను కన్నా ఏ పద్దతిలో కూడా అడ్డుకోలేరు. అయినా ఎందుకింత వ్యతిరేకిస్తున్నారు ?

 

ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వివరాల ప్రకారం అమరావతి గ్రామంలో కన్నాకు సుమారు 9 ఎకరాల భూమి ఉందట. ఈ భూమిని 2007లోనే కొన్నట్లు డాక్యుమెంట్ల ప్రకారం తెలుస్తోంది. కాబట్టి చంద్రబాబునాయుడు అండ్ కో తరహాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొన్నది కాదని అర్ధమైపోతంది. అయితే రాజధాని అమరావతి నుండి తరలిపోతే భూముల ధరలు ఒక్కసారిగా పడిపోతాయని అందరికీ తెలిసిందే.

 

కన్నా అప్పట్లో భూమి ఎందుకు కొన్నారో తెలీదు కానీ 2014లో టిడిపి అధికారంలోకి రాగానే రాజధాని ప్రకటన తర్వాత ఒక్కసారిగా ధరలు ఆకాశానికి చేరుంటాయనటంలో సందేహం అవసరం లేదు. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిక్యుటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని చేసుకోవాలని అనుకోవటంతో  వివాదం ముసురుకుంది.

 

జగన్ ప్రతిపాదన వెలుగు చూడగానే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అందరి భూముల ధరలు పడిపోతున్నట్లుగానే కన్నా కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి ధరలు కూడా పడిపోతుండచ్చు. అందుకనే జగన్ ప్రతిపాదనను కన్నా ఇంతగా వ్యతిరేకిస్తున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి.

 

తానొక్కడే ఎంతగా వ్యతిరేకించినా ఉపయోగం కనబడకపోవటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలుపుకున్నారు. అప్పటికేదో పవన్ రంగంలోకి దూకితే ప్రళయం వచ్చేస్తుందని కన్నా అనుకున్నారేమో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజధాని గ్రామాల్లో పవన్ కు కూడా సుమారు 80 ఎకరాలున్నట్లు బయటపడింది. దాంతో పవన్ మాటలకు విలువ లేకుండా పోతోంది. కాబట్టి కన్నా మాటలకున్న విలువ కూడా ఇంతే. మొత్తం మీద కన్నా ఆందోళనల వెనుక లోగుట్ట బయటపడిందా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: